ఇటీవలి కాలంలో టీ20 ఫార్మాట్ తెర మీదికి వచ్చి  టెస్ట్ ఫార్మాట్  వైభవం తగ్గిపోయింది. కానీ ఎక్కువ మంది క్రికెటర్లు మాత్రం టెస్టు ఫార్మాట్లో ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. టెస్టు ఫార్మాట్లో రికార్డులు కొల్లగొట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇక టెస్టు ఫార్మాట్ ప్రతి ఒక ఆటగాడి సహనానికి ప్రతిభకు కూడా సవాల్ లాంటిది అనే చెప్పాలి. ఎంతో ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడుకుంటూ భారీగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో ఎక్కువ పరుగులు చేయడం కూడా కాస్త కష్టమే అని చెప్పాలి.



 ఇకపోతే ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఉత్కంఠ  భరితంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్  అరుదైన  మైలురాయిని అందుకున్నాడు.  టెస్టు ఫార్మాట్లో 1000 పరుగులు పూర్తి చేసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 14 ఆటగాడిగా ఇంగ్లాండ్ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్ లో అతి చిన్న వయసులో 10000 పరుగులు  పూర్తి చేసిన ఆటగాడు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న అలెస్టర్ కుక్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. 31 సంవత్సరాల 157 రోజుల వయసులో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరు 31 సంవత్సరాల 157 రోజుల వయస్సులోనే 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మీడియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ 31 సంవత్సరాల 326 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు కల్లీష్ 33 సంవత్సరాల 134 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్ 33 సంవత్సరాల 163 రోజుల్లో 10 వేల పరుగులు చేయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: