నిన్న పాకిస్తాన్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్ డే ఆఖరి వరకు చాలా ఉత్కంఠగా జరిగింది. మ్యాచ్ చూస్తుంన్నంత సేపు నెదర్లాండ్ గెలిచేలాగా అనిపించింది. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టమైన పాకిస్తాన్ కు అంతటి పరిస్థితి ఎందుకు కలిగింది. అసలు మ్యాచ్ లో ఏమి జరిగింది అనేది ఒకసారి చూద్దాం.

మొదటి వన్ డే లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ బలమైన పాకిస్తాన్ ను నెదర్లాండ్ ఏ మేరకు అడ్డుకుంటుందో అని అంతా భావించారు. అందుకు తగిన విధంగానే పాకిస్తాన్ ఆరంభంలో ఆచితూచి ఆడినా కుదురుకున్నాక బ్యాట్ జులిపించింది. ఓపెనర్ లలో ఇమామ్ ఉల్ హాక్ రెండు పరుగులకే అవుట్ అయినా.. రెండవ వికెట్ కు బాబర్ ఆజామ్ తో కలిసిన ఫకార్ జమాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ దశలో ఫకార్ సెంచరీ 109 పరుగులు సాధించాడు. ఇక బాబర్ ఆజామ్ 74 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వీరిద్దరూ అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ పూర్తిగా గతి తప్పింది. ఒకవేళ చివర్లో సదబ్ ఖాన్ మరియు అఘా సల్మాన్ విలువైన పరుగులు చేయకుంటే 300 పరుగులు కూడా చేయడం కష్టమయ్యేది. ఆ విధంగా పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది.

పాకిస్తాన్ కు ఉన్న బౌలింగ్ వనరులను ఎదుర్కొని ఈ లక్ష్యాన్ని సాధించడం నెదర్లాండ్ కు దాదాపు అసాధ్యమే. అయితే నెదర్లాండ్ మాత్రం ఎక్కడా పెద్ద జట్టుతో ఆడినట్లు అనిపించలేదు. నెదర్లాండ్ ఒక దశలో ఆఖరి 10 ఓవర్లకు 100 పరుగులు చేయాల్సి వచ్చింది. అంతలా నెదర్లాండ్ ఆటగాళ్లు తమ ఆటతీరుతో పాకిస్తాన్ ను ఓటమి అంచుల వరకు తీసుకువచ్చారు. కానీ చివరకు పాకిస్తాన్ లాంటి అనుభవం ఉన్న బౌలింగ్ ముందు ఓటమి చెందక తప్పలేదు. కేవలం  16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లేదంటే పాకిస్తాన్ పసికూన నెదర్లాండ్ చేతిలో ఖచ్చితంగా ఓటమి పాలయ్యేది. మరో రెండు వారాల్లో ఆసియా కప్ ముందు ఇలాంటి ప్రదర్శన పాకిస్తాన్ నుండి ఎవ్వరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా తమ బౌలర్ షహీన్ ఆఫ్రిది గాయం కారణంగా దూరం కావడం పెద్ద దెబ్బే అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: