గత కొంత కాలం నుంచి టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది అని చెప్పాలి. అయితే గత ఏడాది జరిగిన మెగా టోర్నీలలో కాస్త నిరాశ  పరిచినప్పటికీ  ద్వైపాక్షిక సిరీస్లలో మాత్రం తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉంది అని చెప్పాలి. ఇండియా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇక ఆతిథ్య జట్టును సొంత గడ్డ పైన చిత్తు చేయడమే కాదు.. ఇక భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్టును కూడా చిత్తుగా ఓడిస్తూ వరుసగా విజయాలు సాధిస్తూ ఉంది అని చెప్పాలి
.


 కాగా రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ద్వైపాక్షిక సిరీస్లలో జైత్రయాత్రను కొనసాగుతూ తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమం లోనే అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ర్యాంకింగ్స్ లో కూడా తమ అత్యుత్తమ ప్రదర్శన తో అంతకంతకు పైకి ఎగబాకుతూ ఉంది అని చెప్పాలి. 2023 ఏడాది లో కూడా టీమ్ ఇండియా శుభారంభం చేసింది అని చెప్పాలి. ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో టి20, వన్డే సిరీస్ లు ఆడింది టీం ఇండియా.  ఈ రెండు సిరీస్లలో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.


 అయితే ఇటీవలే  న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేల సిరీస్లలో కూడా ఇదే తరహా జైత్ర యాత్రను కొనసాగించింది. వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి 3-0 తేడాతో న్యూజిలాండ్ ను క్లీన్స్వీప్ చేసింది.  ఈ క్రమం లోనే టీమ్ ఇండియా ఆట తీరుపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టులు వన్డే టీ20 ఫార్మాట్లో టీమిండియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందంటూ చెప్పుకొచ్చాడు. అతను చెప్పినట్లుగానే ఇటీవల న్యూజిలాండ్ పై గెలిచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. ఇక టి20 లో ఎలాగో అగ్రస్థానంలోనే ఉంది. టెస్ట్ ఫార్మాట్లో రెండో స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: