ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత పర్యటనకు వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. దీంతో ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే దాని పైనే సోషల్ మీడియాలో రివ్యూలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.


 మాజీ ఆటగాళ్ళు అందరూ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా టెస్ట్ సిరీస్ హాట్ టాపిక్ గా మారిపోయిన నేపథ్యంలో.. ఈ టెస్ట్ సిరీస్ కు అసలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనే పేరు ఎలా వచ్చింది అన్నది కూడా ఎంతోమందిలో ఒక ప్రశ్న మెదులుతుంది. ఇక ఆ వివరాలు చూసుకుంటే.. భారత్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే టీమిండియా ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ పోరు హోరాహోరీగా  జరుగుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత టీమ్ ఇండియా క్రికెట్ ఆడటానికి వెళ్లిన తొలి దేశం ఆస్ట్రేలియనే కావడం గమనార్హం.


 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంటే ముందు ఇరుదేశాల మధ్య 50 టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఇందులో 24 ఆస్ట్రేలియా గెలిస్తే.. భారత్ 8 టెస్టులు మాత్రమే నెగ్గింది.  18 టెస్టులు డ్రా గా ముగిసాయి. అయితే 1992 తర్వాత ఇరు జట్ల మధ్య 1996- 97లో టెస్ట్ మ్యాచ్ జరిగింది. భారత్ లోనే జరిగిన ఈ సిరీస్ కు భారత క్రికెట్ దికజం సునీల్ గవాస్కర్.. ఆసిస్ లెజెండ్రీ బ్యాటర్ అలెన్ బోర్డర్ పేరిట నిర్వహించారు. ఇక అప్పటి నుంచి ఈ సిరీస్ ను  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని పిలవడం మొదలుపెట్టారు. కాగా 1978 నుంచి 94 వరకు ఆస్ట్రేలియా తరఫున ఆడాడు అలెన్ బోర్డర్. ఇక మరోవైపు సునీల్ గవాస్కర్ 1971 నుంచి 87 వరకు భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి లెజెండరీ క్రికెటర్ గా ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: