ప్రస్తుతం భారత జట్టు వరుసగా సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో అటు వెస్టిండీస్ తో వరుసగా సిరీస్ లు ఆడేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇక ఇప్పటికే వెస్టిండీస్ తో సిరీస్ కు సంబంధించి ఇక జట్టు వివరాలను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.  అయితే 2023 ఐపీఎల్ సీజన్లో అదరగొట్టి సూపర్ ఫామ్ కనబరిచిన ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ కి అటు భారత జట్టులో చోటు దక్కింది అనేది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆసియా కప్.. వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అటు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు బీసీసీఐ సెలెక్టర్లు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తో సిరీస్లలో అటు భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉన్నారు  అయితే ఇక వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమైన భారత జట్టు గురించి ఇటీవల భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.



 వెస్టిండీస్ తో సిరీస్ లకు భారత్ అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలి అనే విషయంపై జాఫర్ కీలక సూచనలు చేశాడు. భారత్ ట్రోఫీలు గెలవాలంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడే యువకులకు జట్టులో చోటు ఇవ్వాలి అంటూ సూచించాడు వసీం జాఫర్. వన్డేలు, t20 లో జైస్వాల్, రింకు, సంజు శాంసన్, జితేష్ శర్మ లకు జాతీయ సెలక్షన్ కమిటీ తుది జట్టులో  ఛాన్స్ ఇవ్వాలి అంటూ సూచించాడు. అయితే పూర్తిగా యంగ్ ప్లేయర్స్ తో టీమిండియా నిండిపోయిన నేపథ్యంలో ఇక వెస్టిండీస్తో వరుస సిరీస్ లలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: