ఒకప్పుడు ఫెదరర్ తర్వాత కాలంలో జకోవిచ్ ఇక ఇప్పుడు తర్వాత తరానికి కార్లోస్ రూపంలో ఛాంపియన్ దొరికేశాడు అంటూ ఎంతోమంది టెన్నిస్ మాజీలు మాత్రమే కాదు ఇతర క్రీడలకు చెందిన ఆటగాళ్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెన్నిస్ ను అమితంగా అభిమానించే సచిన్ టెండూల్కర్ సైతం ఈ నయా చాంపియన్ గురించి స్పందిస్తూ ప్రశంసలు వర్షం కురిపించాడు. టెన్నిస్లో తర్వాత తరం సూపర్ స్టార్ వచ్చేసాడు. ఇకనుంచి అతనిని అనుసరిస్తున్నాను అంటూ క్రికెట్ దిగజం సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
వింబుల్టన్ లో వరుసగా టైటిల్ గెలుస్తున్న జకోవిచ్ ఆధిపత్యానికి తెరదించుతూ 20 ఏళ్ల కార్లోస్ ఛాంపియన్గా అవతరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు సచిన్ టెండూల్కర్ ఇద్దరు కూడా ఫైనల్ మ్యాచ్లో గొప్పగా ఆడారు. అల్కరాస్ రూపంలో టెన్నిస్లో కొత్త సూపర్స్టార్ చూస్తున్నాం. అయితే ఫెధరర్ ను ఫాలో అయినట్లే.. వచ్చే దశాబ్దం పాటు అల్కరాస్ ను అనుసరిస్తాను అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు. మానసిక దృఢత్వం అంటే జకోవిచ్. శారీరక, మానసిక సమస్యలు ఉన్న టెన్నిస్లో అతను ముందుకు వెళ్తున్నాడు అంటూ జకోవిచ్ ను సచిన్ అభినందించాడు. కాగా క్రికెట్ లోకి రాకముందు టెన్నిస్ ఆటగాడు అయినా సచిన్ టెండూల్కర్ దిగ్గజా ఫెదరర్ ని కూడా ఆరాధించేవాడు. ఒకానొక సమయంలో స్వయంగా మ్యాచ్కు వెళ్లి అతని కలిశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి