ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు.. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడే తోపు అనే ఒక డైలాగ్ను అచ్చు గుద్దినట్లుగా నిరూపించింది ఆస్ట్రేలియా. ఎందుకంటే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. ఒకానొక సమయంలో కనీసం సెమి ఫైనల్ కు అయిన వెళ్తుందో లేదో అని అందరూ అనుమానపడ్డారు. అలాంటిది సెమీఫైనల్ వరకు వెళ్లడం ఇక అక్కడ గెలిచి ఫైనల్లో అడుగుపెట్టడం ఫైనల్ లోను టీమిండియాను ఓడించడం చేసింది.


 అయితే ఇలా వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఒక జట్టు విశ్వవిజేతగా నిలిచింది అంటే ఆ టీంలోని ఆటగాళ్లు ఎంతలా చెమటోడ్చి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా కష్టపడి జట్టును గెలిపించిన ఆటగాళ్లకు వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇక కాస్త విశ్రాంతి ఇవ్వడం చేస్తూ ఉంటారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకి ఆ అదృష్టమే లేకుండా పోయింది. వరల్డ్ కప్ ముగిసిందో లేదో కేవలం రోజుల వ్యవధిలోనే భారత్తో టి20 సిరీస్ ఆడటానికి రెడీ అయింది ఆస్ట్రేలియా. ఇక వరల్డ్ కప్ లో ఉన్న ఆటగాళ్లే అటు టి20 సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టులోనే ఉండడం గమనార్హం. అయితే ఆస్ట్రేలియా జట్టు టి20 సిరీస్ లో వరుసగా రెండు ఓటములతో కాస్త నిరాశపరిచింది.


 అయితే వరల్డ్ కప్ ముగిసిన  వెంటనే టి20 సిరీస్లో రాణించాలి అనడం సరైన పద్ధతి కాదని.. ఆటగాళ్లు రోబోలు కాదు అంటూ అటు ఆస్ట్రేలియా పూర్తిస్థాయి కెప్టెన్ ఫ్యాట్ కమిమ్స్ అభిప్రాయపడ్డాడు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సి స్పందిస్తూ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే.. ఇలా టి20 సిరీస్ ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసాడు  వరుసగా టోర్నీలు ఆడటంతో ఆటగాళ్లపై ఒత్తిడి పడుతుంది. వరల్డ్ కప్ విలువను తక్కువ చేస్తుందని కాదు. టి20 సిరీస్ విలువ తగ్గిపోతుందని నా అభిప్రాయం   ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్లు ఆడేలా.. అధికారులు షెడ్యూల్ రూపొందించడం సరికాదు అంటూ మైక్ హసి అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: