తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రి కేవలం జన్మని మాత్రమే ఇస్తే.. జన్మకు అసలైన అర్థం చెప్పేది సరైన దారిలో నడిపించేది గురువు అని చెప్పాలి. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థానానికి ఎదగడంలో గురువులదే కీలక పాత్ర. ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఒకప్పుడు ఒక గురువుకి విద్యార్థే. అంతలా ప్రతి ఒక్కరి జీవితంలో గురువుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది అని చెప్పాలి. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తమకు విద్య చెప్పిన గురువులను చాలామంది మర్చిపోకుండా ఎప్పుడు కనిపించిన ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు.


 ఇలా ప్రతి ఒక్కరూ గురువే దైవం అని భావిస్తున్న సమయం లో.. కొంత మంది మాత్రం ఏకంగా ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పాలి. తన దగ్గర చదువుతున్న పిల్లలను సొంత పిల్లలుగా భావించి ప్రేమగా చూసుకుంటూ పాఠాలు బోధించాల్సింది పోయి.. నీచమైన ఆలోచన చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక ఇలాంటి వారు ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక గణితం టీచర్ చేసిన నిర్వాకం కాస్త ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది.


 విద్యార్థులకు లెక్కలు చెప్పాల్సిన ఆ గణితం టీచర్ కామం తో ఊగి పోయింది. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలోని మదన పల్లిలో వెలుగు చూసింది. ఏకంగా పాఠాలు బోధించాల్సిన ఆ టీచర్ పడకింటి పాఠాలు చెబుతుంది. విద్యార్థుల తో కామకోరికలు తీర్చుకుంటుంది. అయితే విషయం తల్లిదండ్రులకు తెలియడం తో వారు నిరసన చేయగా ఆమెను తొలగించారు. మళ్ళీ ఇప్పుడు ఆమె విధుల్లోకి వస్తుందని తెలియడం తో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: