1+8 =9 ఈ ప్రపంచంలో చాలామంది ఎంతో అదృష్ట నెంబర్ గా భావించే సంఖ్య . 2+0+2+5=9 .. ప్రస్తుత సంవత్సరం .. ఇందులో కూడా తొమ్మిది వచ్చింది .. ఈ నెంబర్ల గోల ఎందుకని అంటున్నారా ? ఈ సంవత్సరం 2025 ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ .. అందుకే తొమ్మిది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది .. అందుకు తగ్గట్టుగానే .. ఐపీఎల్ మెగా వేలం నుంచి 18వ సీజన్ పెద్ద సంచలనాలతో మొదలైంది .. ఎప్పుడూ లేనివిధంగా (భారత్ - పాక్ ఉద్రిక్తతలతో) మధ్యలో కొంత విరామం కూడా వచ్చింది .. ఇప్పుడు ఏకంగా కొత్త ఛాంపియన్ పుట్టబోతుంది .. 18 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న .. ఇప్పటికీ ఒక్కసారి కూడా కొప్పు అందుకొని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్ సి బి) , పంజాబ్ కింగ్స్ ఈరోజు ఐపీఎల్ ఫైనల్ లో పోటీ పడుతున్నాయి .

– అలాగే ఓ స్టార్ ప్లేయర్ కి అత్యధిక ధ‌ర‌ చెల్లించింది కూడా ఈ ఐపీఎల్ లోనే (27 కోట్లు రిషబ్ పంత్ )

– ఐపీఎల్ 2008లో మొదలు పెట్టక .. ఒక సంవత్సరం కూడా ఎక్కడ ఆగలేదు .. ఈ ఏడాది మాత్రం భారత్ , పాక్ గొడవలతో 8 రోజులు ఆగింది ..

– ప్రజెంట్ సీజన్లో బ్యాటర్ల ఆధిపత్యం గట్టిగా కొనసాగింది .. ఇంకా ఫైనల్ కూడా పూర్తి కాకుండానే అత్యధిక రన్ రేట్ (9.62) శాతంగా నమోదయింది .

– అలాగే బ్యాటింగ్ యావరేజ్ 29.12 కాగా .. స్టైక్రేట్ 152. 46 .. అలాగే అత్యధిక ఫోర్లు 2,226 , అత్యధిక సిక్సర్లు 1,271, అత్యధిక అర్థ శతక భాగస్వామ్యాలు (178) ఈ సీజన్లోని నమోదయ్యాయి ..

– బౌలింగ్ యావరేజ్ 31.59 కాగా .. కేవలం 7 వైడ్లు మాత్రమే ఇచ్చారు ..

– ఇక ఫైనల్ మ్యాచ్ కంప్లీట్ అయితే ఈ లెక్కలు కూడా మారతాయి ..

– 2022లో ఐపీఎల్ లో అడుగు పెడుతూనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ కప్పు గెలిచింది .. ఇది కాక‌ కొత్త ఛాంపియన్ చూసింది .. 2014లో  కోల్కత్తా విజేతగా నిలిచింది .. ఆ తర్వాత సన్రైజర్స్ 2016లో టైటిల్ గెలిచిన దీనికి పూర్వ ఫ్రాంచేసి డెక్కన్ చార్జర్స్ 2009లోనే లీగ్ విజేత కావడం ఇక్కడ గమనార్హం ..

– 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి కొత్త ఛాంపియన్ చూడబోతున్నాం .. ఇక మరి టీం ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్య వహిస్తున్న బెంగళూరు కొప్పు కొడుతుందా ? అద్భుతమైన కెప్టెన్ గా ప్రశంసలందుకుంటున్న శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందా ?

– ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే : పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఈ సంవత్సరమే బాధ్యతలు తీసుకున్నారు .. అలాగే అటు బెంగళూరు కెప్టెన్ గా రజిత్ ప‌టిదార్ కూడా ఈ ఏడాదే కెప్టెన్గా అయ్యారు .. ఫైనల్ జ‌ట్లకు ఇద్దరూ కొత్త కెప్టెన్లే ఉన్నారన్నమాట ..

మరింత సమాచారం తెలుసుకోండి: