ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన ఏకైక
రియాలిటీ షో బిగ్‌బాస్ అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
స్టార్ మా ఛానెల్‌లో 4 సీజన్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా నడిచిన ఈ షో ఇప్పుడు 5వ సీజన్‌కు రెడీ అవుతోంది.
బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 5 కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టారట. ఈ క్రమలోనే కొత్త సీజన్‌లో హౌస్‌లో ఎవరు ఉండబోతున్నారు..? అనే విషయాలపై కూడా ఇప్పటికే కొన్ని రూమర్లు బయటకొస్తున్నాయి. తాజాగా 5వ సీజన్‌లో ఫేమస్ సింగర్ హేమచంద్రను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రతి సీజన్ లో ఒక సింగర్ ఉండే విధంగా జాగ్రత్త పడుతున్న
బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ లో ప్రముఖ సింగర్ హేమచంద్రను తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడిన హేమచంద్రకు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే హేమచంద్రకు గతంలో
బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా ఆ షోలో పాల్గొనటానికి నో చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే
బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే ఛాన్స్ వస్తే
హేమచంద్ర ఆ ఆఫర్‌కు ఓకే చెబుతారో లేదో తెలియాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటివరకు బిగ్‌బాస్ యాజమాన్యం నుంచి కానీ,
హేమచంద్ర నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేదు. దీనిపై సరైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు
హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. తాజాగా సీజన్ 4 కంటెస్టెంట్లలో చాలామంది వరుస ఆఫర్లతో బిజీగా మారిన విషయం తెలిసిందే. మోనాల్‌కు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆఫర్లు వస్తుండగా
అవినాష్ కామెడీ షోలతో బిజీ అయ్యాడు. ఇక రన్నరప్ సోహెల్ అయితే ఏకంగా ఓ సినిమాలో హీరోగా బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.
అఖిల్ మోనాల్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తుండగా
గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమాలో అఖిల్‌కు ఛాన్స్ దక్కినట్టు ప్రచారం జరుగుతోంది.