కార్తీక దీపం సీరియల్ రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. దీప , డాక్టర్ బాబు మళ్లీ కలిసిపోయారు.. దీంతో నెక్స్ట్ ఎంటి అనే ఆలోచనలు జనాలకు కలుగుతున్నాయి.. ఎవరు ఎంతగా మారినా కూడా మోనిత మాత్రం ఏదో సాధించాలని లక్ష్యంగా చేసుకుని ఉంటుంది. నిన్న జరిగిన సీన్ లో అదే సరుగుతుంది.భారతి(డాక్టర్) దీప పరిస్థితి పూర్తి క్రిటికల్ పొజీషన్ అని చెబుతుంది. రేపు దీపకు ఏదైనా అయితే పిల్లలు తట్టుకోలేరు దీపా..’ అంటాడు కార్తీక్. వెంటనే కారు బ్రేక్ వేస్తుంది మోనిత.


‘ఏం అయ్యింది’ అంటాడు కార్తీక్. ‘నా పేరు మోనిత.. నువ్వు దీపా అంటున్నావ్’ అంటుంది మోనిత వెటకారంగా. ‘హో దీప గురించే ఆలోచిస్తున్నాను కదా.. అందుకే అలా వచ్చి ఉంటుంది’ అని కార్తీక్ అనగానే.. ‘నువ్వు దీపకు ఏమైనా అయితే తట్టుకునేలా లేవు కార్తీక్..’ అంటూ కారు డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ‘నీకు దీప ఎప్పటి నుంచో తెలుసు కదా.. తప్పు విషయం పక్కన పెట్టు.. అనారోగ్యంతో ఆమె ప్రాణాలకే ప్రమాదం అని తెలిశాక.. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావ్’ అని కార్తీక్ అడగడంతో.. ‘కచ్చితంగా ఫీల్ అవుతున్నా.. జాలి పడుతున్నా.. తట్టుకోలేకపోతున్నా.. కానీ నువ్వే జాలితో పాటు ఆమె చేసిన తప్పులని కూడా మరిచిపోతున్నావేమో అనిపిస్తోంది. ఎంతైనా ఆమె నీ భార్య కదా..’ అని మోనిత అనగానే.. ‘నీకు దీప మీద ఇంత సాప్ట్ కార్నర్ ఉందా..? ఏంటీ నీలోని ఇంత మార్పు’ అంటాడు కార్తీక్ అనుమానంగా... ఇది సీన్ హైలెట్ అనే చెప్పాలి..


అందరూ డైనింగ్ టేబుల్ మీద తింటుంటే.. అక్కడ దీప, పిల్లలు ఉండరు. వాళ్లు పైన నీ కోసం కలిసి తినడానికి వెయిట్ చేస్తున్నారు అనడంతో.. కార్తీక్ మనసులో.. ‘వీళ్లంతా దీపని నన్ను కలపడానిక ప్లాన్ చేస్తున్నారా’ అనుకుంటాడు. ‘పైకి వెళ్లి నా రూమ్‌లో ఉంటాను తప్ప.. పైకి వెళ్లను’ అనుకుంటూ వెనుదిరుగుతాడు. ‘పైకి వెళ్లలేదో గొడవలు అయిపోతాయి’ అని సౌందర్య.. ‘పైకి వెళ్లి వాళ్లతో తినలేదు అనుకో.. దీప నేను మందులు వేసుకోవడం మానేస్తా’ అని ఆనందరావు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇక కమింగ్ అప్‌లో కార్తీక్ పైకి వెళ్లడం, దీప మురిసిపోతూ కార్తీక్‌తో కలిసి భోజనం చెయ్యడం.. సీన్ చూసిన ఇంట్లో వాళ్లంతా సంతోషంతో తబ్బి ఉబ్బి పోతారు.. రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: