
అలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు జబర్దస్త్ ను వీడి వెళ్లిపోతున్నారు. టిఆర్పి రేటింగ్ విషయంలో ఎలా ఉన్నప్పటికీ ఈ షో చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య మాత్రం ప్రతి రోజుకి పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలను కూడా ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అయితే గతంలో జబర్దస్త్ గురించి ఒక విషయం మాత్రం బాగా వైరల్ గా మారింది. కేవలం ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉండేది అన్నట్లుగా వార్తలు వినిపించేవి.
కానీ జ*ర్దస్త్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనే వార్తలు బాగా వినిపించాయి. జబర్దస్త్ లో ఉండే ఒక స్టార్ కమెడియన్ ఏకంగా లేడీ కమెడియన్ విషయంలో చాలా మితిమీరి అసభ్యకరంగా ప్రవర్తించారని. ఈ విషయాన్ని మల్లెమాల సంస్థకు ఆ కమెడియన్ తెలియజేయగా ఎవరు పట్టించుకోలేదని.. అంతేకాకుండా ఆ కమెడియన్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వార్తలు బాగా వినిపించాయి. అయితే ఇలాగే జబర్దస్త్ మీద పలు వార్తలు ఎక్కువగా వైరల్ గా మారాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉన్నదో లేదో తెలియదు కానీ ఈ విషయం మాత్రం మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.కానీ ఇందులో పాల్గొన్న ఏ ఒక్కరు కూడా కాస్టింగ్ కౌర్ బారిన పడినట్టుగా తెలియజేయలేదు. కేవలం ఇవన్నీ రూమర్లు అన్నట్లుగా సమాచారం.