టాలీవుడ్ లో యాంకర్ గా పేరు సంపాదించిన సుమ కనకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. వెండితెర స్టార్ హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అలా యాంకర్ సుమకి కూడా బుల్లితెర పైన కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సుమ తీసుకొనే రెమ్యూనరేషన్ కూడా అంతే స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రమోషన్స్ కు మాత్రం సపరేటుగా ఛార్జ్ చేస్తూ ఉంటుంది సుమ. తాజాగా సుమకి సంబంధించి ప్రమోషన్స్ కి ఎంత తీసుకుంటుందనే విషయానికి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.



యాంకర్ సుమ తనకి పదహారేళ్ళ వయసులోనే యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ప్రస్తుతం టాప్ టెలివిజన్ షోలలోనే యాంకర్ గా రానిస్తోంది. ముఖ్యంగా ఈటీవీలో స్టార్ మహిళ అనే గేమ్ షోతో భారీగానే సంపాదిస్తోంది.. ఈ షో కి ఎక్కువ కాలం ప్రసారమైన ఘనత కూడా సుమకే లభించింది. 12 ఏళ్లుగా ఈటీవీలో విజయవంతంగా ఈ షో కొనసాగడం అంటే అది చాలా విశేషం అని చెప్పవచ్చు.


యాంకర్ సుమ ఒక్కో బ్రాండ్ ప్రమోషన్స్ కోసం సుమారుగా 10 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తోందట. అలాగే సినిమా ఈవెంట్లకు కూడా ఈ రేంజ్ లోనే చార్జ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మరొక టెలివిజన్ యాంకర్ చెప్పడం చెప్పడం గమనార్హం. యాంకర్ సుమకి సపరేట్ గా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉందని అందుకే ఆమెకు అందరికంటే ఎక్కువగా పారితోషకం ఇస్తూ ఉన్నారని వెల్లడించింది. యాంకర్ సుమ బుల్లితెర మీద కాకుండా వెండితెర మీద కూడా పలు రకాల చిత్రాలలో కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం సుమ అడ్డ అనే షోతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది సుమ. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే తన కుమారుడిని కూడా హీరోగా పరిచయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: