తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు. ఎన్ని సీరియల్స్ వచ్చిన ఎంతమంది బుల్లితెర నటీమణులు వచ్చిన ప్రేమి విశ్వనాథ్ క్రేజ్ ని బీట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టిఆర్పి రేటింగ్ అత్యధికంగా రావడానికి నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం 10 దాటితే చాలు సూపర్ అనేలా మారిపోయింది కానీ జాతీయస్థాయిలోనే 21.07 టిఆర్పి రేటింగ్ తో కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్క రాబట్టిన చరిత్ర ఉన్నది. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ రేటింగ్ అన్నట్లుగా సమాచారం.




ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కార్తీకదీపం సీరియల్ సుమారుగా మూడున్నర ఏళ్ల పాటు 1500 ఎపిసోడ్లకు పైగా ఈ సీరియల్ ప్రసారమయ్యేది. ప్రస్తుతం కార్తీకదీపం సీజన్ 2 కొనసాగుతోంది. ఈ సీరియల్ కూడా టాప్ రేటింగ్ లోనే అటు ఇటుగా వస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ కి మూల స్తంభంగా చూపించారో ఇప్పుడు అదే పెద్ద మైనస్ గా మారుతున్నది. అది ఎవరో కాదు ప్రేమి విశ్వనాథ్. ఈ విషయం అభిమానులకు నచ్చకపోయినప్పటికీ ఇది నిజం అంటూ చాలామంది నెటిజన్స్ తెలుపుతున్నారు.


అయితే ఇప్పుడు వంటలక్కను చూస్తూ ఉంటే మాత్రం అది కూడా కార్తీక్ పక్కన భార్యగా చూస్తూ ఉంటే.. అతనికి తల్లిలా కనిపిస్తోందని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ గా అంత ఏజ్ లేకపోయినప్పటికీ ఆమె ప్రొఫైల్స్ చూస్తే హీరోయిన్ రేంజ్ లో కనిపిస్తూ ఉంటుంది. కానీ కార్తిక దీపం 2 సీరియల్లో వచ్చేసరికి ఆమెను మేకప్ తో జోడించడంతో చూడడం చాలా ఇబ్బందిగా మారింది అంటూ పలువురు అభిమానులే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దీపాని పెళ్లికూతురుగా అసలు చూడలేకపోతున్నామని ఆమెకు వేసిన మేకప్ చూస్తూ ఉంటే దీప పెళ్లా లేకపోతే అది షష్టిపూర్త అన్నట్లుగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా కూడా మేకప్ కు వచ్చిన తిప్పలు అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: