ప్ర‌స్తుతం కాలంలో టీవీ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో. అంతగా స్మార్ట్ ఫోన్ నేటి మాన‌వుల‌కు ఓ భాగ‌మైపోయింది. ఈ క్ర‌మంలోనే వేలకు వేలు పెట్టి స్మార్ట్ ఫోన్లు కొంటున్నాం. అయితే ఏదైనా ఒక చిన్న‌ తప్పు చేసినా లేదా ఒక్క సెకను అజాగ్రత్తగా ఉన్నా.. మన నిత్యవసర వస్తువు మ‌రియు ఖ‌రీదైన‌ స్మార్ట్ ఫోన్ ని కోల్పోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా ఫోన్ నీటిలో ప‌డితే మాత్రం.. ఆ బాధ  వర్ణణాతీతం అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

ఇలాంటి సమస్య ఎదురైనపుడు ఇంతటితో నా ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడకుండా, చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు కొన్ని టిప్స్ మాత్రం త‌ప్ప‌కుండా ఫాలో అవ్వాలి. ముందు ఫోన్ నీటిలో పడగానే వెంటనే బయటకు తీసి స్విచ్ఛాఫ్ చేయాలి. నీటిలో ఉండే సమయం పెరిగే కొద్దీ ఫోన్ పాడయ్యే అవకాశాలు పెరుగుతాయి. స్విచాఫ్ చేసిన తరువాత ఫోన్‌లోని బ్యాటరీ, సిమ్ కార్డ్స్ ఇంకా మెమరీ కార్డ్స్‌ను తొలగించండి.

 

ఫోన్ లోపలి భాగాలను తొలగించిన తరువాత ఫోన్ కొద్ది సేపు షేక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ ని డ్రై చేసేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా కాట‌న్ టవల్ వాడుతూ తడిని తుడిచేయండి. ఆ తరువాత జిప్‌లాక్ బ్యాగ్‌లో పొడి బియ్యాన్ని వేసి, ఆ బియ్యంలో ఫోన్‌ను పెట్టి బ్యాగ్‌ను టైట్‌గా లాక్ చేయండి. అనంతరం ఆ బ్యాగ్‌ను ఒక రోజు పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. బియ్యం ఫోన్ లోపల ఉన్న తడిని పీల్చుకుంటాయి. ఇప్పుడు ఫోన్ బ‌య‌ట‌కు తీసి బ్యాట‌రీని జ‌త చేసుకుంటే స‌రిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: