రోజు రోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న సంగతి మనకి తెలిసిందే. ఈ టెక్నాలజీ యుగంలో అసలు మానవుల అవసరమే లేకుండా పోతుంది. ఇక రాబోయే రాజ్యం మొత్తం రోబోల రాజ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు.. ఇక మానవులతో పని ఉండదట. మొత్తం రోబోలతోనే ప్రపంచం నడవబోతుందని తెలుస్తోంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఒకప్పుడు ఇళ్లలో చీపుర్లు వాడేవారు.ఆ చీపుర్లలను కొబ్బరి మట్ట పుల్లలతో తయారు చేసేవారు.అలా తయారైన చీపుర్లను మార్కెట్లో ఐదు, పది రూపాయలు పెట్టి కొనుక్కునేవారు. ఇక గతంలో చాలామంది ఇంటి దగ్గరే కొబ్బరి మట్టలను తీసుకువచ్చిపుల్లలు చీల్చి చీపుర్లు కట్టుకునేవారు. ఆ తర్వాత కొంతమంది చీపుర్లు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. అలా ఒకప్పుడు ఐదు రూపాయలు పది రూపాయల చీపుర్లు ఇప్పుడు 40,50 రూపాయలు వస్తుంది. ఇక వేరే చీపురు అయితే 150,200 ధర పలుకుతుంది.

 అయితే ఇప్పుడు ఈ చీపుర్లతో పనే లేకుండా పోయింది. ఇల్లు ఊడ్చే మిషన్లు వచ్చేసాయి. అదే ఇల్లు ఊడుస్తుంది.. అదే ఇల్లు తుడుస్తుంది. అదే చార్జింగ్ కూడా పెట్టుకుంటుంది. అయితే ఒకప్పుడు 20,30 రూపాయలకు వచ్చిన చీపురు ఇప్పుడు వందలు వేలు పెట్టి మిషన్ రూపంలో ఇల్లు ఊడవడానికి, తుడవడానికి కొనుక్కుంటున్నారు జనాలు. అలా పూర్తిగా పనిముట్లు దొరకకుండా ప్రపంచం తయారైపోతుంది.ఒకప్పుడు వ్యవసాయం చేయడానికి మనుషుల్ని వాడేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయం చేసే మిషన్లు వచ్చాయి. నాట్లు వేసే మెషిన్లు, కలుపులు తీసే మిషన్లు ఇలా ప్రతి ఒక్కటి మార్కెట్లోకి అందుబాటు వచ్చాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంది అంటే రాబోవు రోజుల్లో ఇక మనుషులు పూర్తిగా ఇంటికే పరిమితమై పూర్తిగా మిషన్లతోనే పని చేస్తారు. అలా మనుషులకు చేతిలో పని లేకుండా పోతుంది. మానవ వనరులు క్రమంగా తగ్గిపోతున్నాయి.

అయితే ఇలాంటి టెక్నాలజీని చైనా తొందరగా క్యాష్ చేసుకోగలుగుతుంది. హ్యుమనాయిడ్  రోబోలు అంటే చాలా మంది వాటి ధర కోట్లలో ఉంటుంది అనుకుంటారు  కానీ చైనా మాత్రం హ్యూమనాయిడ్ రోబోలను కేవలం 5 లక్షల్లో తయారు చేస్తుందట. ఇక ఈ రోబోలు గనుక మార్కెట్ లోకి వస్తే మనుషులతో పూర్తిగా పని లేకుండా పోతుంది.ఈ హ్యూమనాయిడ్ రోబో మనం ఏం చెబితే అది చేస్తుంది. టీ పెట్టమంటే టీ పెడుతుంది. ఇల్లు ఊడవమంటే ఇల్లు ఊడుస్తుంది. వంట చేయమంటే వంట చేస్తుంది.బట్టలు పిండడం, అంట్లు తోమడం ఇలా ప్రతి ఒక్కటి ఆ రోబోనే చేసేస్తుంది. అలా ఒక మనిషి ఎలా అయితే పనిచేస్తుందో ఈ హ్యూమననాయిడ్ రోబో కూడా అన్ని పనులు చేసి మనిషి అవసరమే లేకుండా చేస్తుంది. అది కూడా కేవలం ఐదు లక్షల రూపాయలకే. అయితే చాలామంది బిజీ లైఫ్ లో భాగంగా ఇంట్లో పని మనుషులని పెట్టుకుంటారు.

కానీ ఈ 5 లక్షల  హ్యుమనాయిడ్ రోబో అందుబాటులోకి వస్తే గనుక పని మనుషులతో పనేలేదు అంతా రోబోల రాజ్యమే. ఇక ఆ హ్యూమనాయిడ్ రోబోలకు ఏదైనా రిపేర్ ఉంటే చేయిస్తే సరిపోతుంది. ఇక ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి పాతికేల్లో, 50 ఏళ్ళో అవసరం లేదు. అతి త్వరలోనే రాబోతోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఫిజికల్ పనులు చేసేటటువంటి మానవ వనరులు తగ్గిపోతున్నాయి. ఇక ఈ హ్యూమనాయిడ్ రోబోలకు 5 లక్షలు అంటే ఎగువ మధ్యతరగతి వాళ్ళు చాలా ఈజీగా కొనుగోలు చేసుకుంటారు. అవసరమైతే ఒక్కో ఇంట్లో ఒకటి కొనేసుకుంటారు. అంత పెద్ద ఖర్చు ఏమి అనిపించదు కాబట్టి రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు. ఈ హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వస్తే ఇక మనుషులతో పని ఉండదు. మనుషులు ఇబ్బందుల్లో పడ్డట్టే అంటున్నారు చాలామంది విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: