
ఇక్కడ ఓ పోలీస్ అధికారి కూడా తనలో దాగి ఉన్న అసమాన్యమైన టాలెంట్ను బయటపెట్టి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. సాధారణంగా పోలీస్ అధికారిగా ఉద్యోగం సంపాదించడం అంటే దానికోసం ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగం సాధించిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎప్పుడూ నిమగ్నమైపోయి ఉండాలి. రాత్రి పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వహించాలి. ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం డాన్స్ పాటలు పాడటం తదితర విషయాల కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉండడం చేస్తూ ఉంటారు.
ఇకపోతే ఇక్కడ ఒక పోలీస్ అధికారి తన గాత్రంతో అందరినీ మాయమరిపింప చేస్తున్నాడు. మహారాష్ట్ర పూణేకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ సాగర్ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన బుజ్జి : ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలోని దేశ్ మేరే పాటను ఆలపిస్తూ అదరగొట్టాడు అని చెప్పాలి. తన గాత్రంతో అందరిని కూడా మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. ఒక కానిస్టేబుల్ లో ఇంత గొప్ప టాలెంట్ దాగి ఉందా అని ఈ పాట వింటున్న నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ అధికంగా చక్కర్లు కొడుతుంది.