టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ వికెట్ కీపర్ ,బాట్స్ మ్యాన్ రిషబ్ పంత్ తాజాగా రూర్కీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి రూర్కీ లో ఉండే తన నివాసానికి వెళుతూ ఉండగా ఈ కారు ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడంతో అక్కడికక్కడే కారు దగ్ధమైపోయినట్లుగా తెలుస్తోంది. మంగళూరు కోత్వాలి ప్రాంతంలో NH 58 లో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.ఈ ప్రమాదంలో రిషబ్ పంతుకు కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తోంది.ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ కొంతమంది సిబ్బంది 108 కీ ఫోన్ చేయగా దగ్గరలో ఉండేటువంటి రూర్కీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఈ ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో మనం ఊహించుకోవచ్చు. కానీ రిషబ్ పంత్ పరిస్థితి ఏమిట అన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.కానీ తీవ్రంగా గాయాలపాలతో మాత్రం ఆసుపత్రిలో చేరారు. పంత్ తలకు మరియు కాలికి తీవ్రమైన గాయాలయ్యాలని తెలుస్తోంది.ఇక ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడ పోలీసులు దేహాత్ స్వప్న, కిషోర్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది . ఈ పరిస్థితిని తెలుసుకోవడం కోసం అక్కడ కొంతమంది సాక్షులు తెలిపిన ప్రకారం పంత్ కారు రీలింగ్ డివైడర్ను ఢీకొని ఆ పైన కారులో మంటలు రావడం వల్ల ఆయన కారు అదుపుతప్పి రైలింగ్ డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడిందని తెలియజేశారు. ఇక తన కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ కు చాలా కాలం దూరంగా ఉండవలసి వస్తుందని చెప్పవచ్చు.. దీంతో అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. మరి ఈ సంఘటన తర్వాత పంత్ కష్టాలు మరింత పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: