భారతదేశంలో ప్రజలు ఈ మధ్య కాలంలో పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చుట్టుపక్కల పరిసరాలు కూడా పట్టించుకోని భారత దేశ ప్రజలు ఇప్పుడు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. వారు ఎంతో శుభ్రంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్వచ్ఛభారత్ మిషన్ వచ్చిన దగ్గర్నుంచి భారతదేశంలో చాలా మందిలో మార్పు కనిపిస్తుంది. భారత ప్రభుత్వం ప్రజలకు పరిశుభ్రత ఎంత ముఖ్యమో తెలియజేయడంలో సఫలీకృతమైంది.
శుభ్రంగా ఉంటే ఎన్ని లాభాలు, ఎంతో ఆరోగ్యకరమో వివరించి వారిని మళ్ళించే ప్రక్రియలో విజయవంతం అయింది . తాము మాత్రమే కాకుండా పక్కన ఉన్న వారు కూడా పరిశుభ్రంగా ఉండాలనే విధంగా ప్రజలు ప్రవర్తిస్తుండడం విశేషం. పరిశుభ్రత లేని విధంగా ప్రవర్తించే వారిని, నియమాలను మితిమీరిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. ఆ విధంగా టీమిండియా మాజీ క్రికెటర్
అజయ్ జడేజా కి
గోవా లో చేదు అనుభవం ఎదురైంది.
క్రికెటర్ గా దేశానికి ఎన్నో సేవలు అందించి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న క్రికెటర్
అజయ్ జడేజా చెత్తను బయట పారేసి నందుకు
స్థానిక గ్రామపంచాయతీ ఆయనకు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. దీంతో చేసేదేమీ లేక ఆయన ఫైన్ కట్టారు. నార్త్ గోవాలోని అల్డొన లో అజయ్
జడేజా కు ఇల్లు ఉంది. అయితే ఆ గ్రామ సమీపంలో నచిలోలాలో అనే ప్రాంతంలో చాలామంది టూరిస్టులు చెత్త పారేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడే చెత్త పారేస్తున్నారు. చెత్త ఎక్కువగా పోవడంతో స్థానికులు ఇక్కడ చెత్త వేసే వారికి జరిమానా వేయాలని నిర్ణయించారు. ఎవరిని ఇంటి నుంచి చెత్త వస్తుందో తెలుసుకునేందుకు కొంతమందిని కూడా నియమించారు. అలా
అజయ్ జడేజా ఇంటి నుంచి వచ్చిన చెత్తను అక్కడ ఉన్న వాళ్లు గుర్తించారు. దీంతో జడేజాకు ఫైన్ వేసారు. మా నిబంధనలు తెలుసుకున్న
జడేజా ఎలాంటి వివాదం లేకుండా ఫైన్ కట్టారని ఆ గ్రామ సర్పంచ్ తృప్తి బందొడ్కర్ చెప్పారు.