ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాతగా దూసుకుపోతున్నాడు. దిల్ రాజు సినిమా అంటే అది మినిమం గ్యారెంటీ సినిమా. టాలీవుడ్‌లో దిల్ రాజు స్థానం వేరు. పంపిణీదారుడిగా జీవితం ప్రారంభించి.. అగ్ర నిర్మాతగా మారిన వ్యక్తి దిల్ రాజు. అలాంటి వ్యక్తిని, అతని వ్యాపారాన్ని ఉద్దేశిస్తూ ఇటీవల కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచాడు వరంగల్‌ శ్రీను. శ్రీను  కూడా నైజాం ఏరియాలో సినిమాల పంపిణీ చేస్తుంటాడు. ఇటీవల ‘క్రాక్‌’ సినిమా విడుదల సమయంలో దిల్ రాజు – వరంగల్‌ శ్రీనుకు మధ్య పెద్ద  వివాదం వచ్చింది. తన సినిమాకు థియేటర్లు రాకుండా చేస్తున్నారని… దిల్‌ రాజుపై శ్రీను వైరల్ కామెంట్స్  చేశాడు. ఆ తర్వాత ఈ వివాదం సమసిపోయేలా కనిపించింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ టాపిక్‌ వైరల్ అవుతుంది..

ఇప్పుడు వరంగల్‌ శ్రీను టాపిక్  చర్చల్లోకి వచ్చి మరోసారి వైరల్ అవ్వడానికి  కారణం ‘ఆచార్య’ సినిమా. అవును మెగాస్టార్  చిరంజీవి ‘ఆచార్య’సినిమానే. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్‌ శ్రీను కొనుగోలు చేశాడని టాక్‌. ఏకంగా ₹40 కోట్లు పెట్టి వరంగల్‌ శ్రీను ‘ఆచార్య’ నైజాం హక్కులు సొంతం చేసుకున్నాడట. దీంతో దిల్‌ రాజుకు వరంగల్‌ శ్రీను దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడని టాలీవుడ్‌లో టాపిక్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం దిల్‌ రాజు కూడా పోటీ పడినప్పటికీ వరంగల్‌ శ్రీను పెద్ద మొత్తం ముందు పెట్టి ఓకే చేయించుకున్నాడట.

‘ఆచార్య’ నైజాం హక్కులు వరంగల్‌ శ్రీనుకు దక్కడానికి వెనుక కొరటాల శివ కూడా ఉన్నాడని అంటున్నారు. ‘భరత్‌ అనే నేను’ సినిమా సమయంలో దిల్‌ రాజు – కొరటాలకు మధ్య చిన్న డిస్ట్రబెన్స్‌ వచ్చిందట. దాని వల్లే ‘ఆచార్య’ వరంగల్‌ శ్రీనుకు వెళ్లిందంటున్నారు. ఈ లెక్కన వరంగల్‌ శ్రీను పంతం నెగ్గి పెద్ద సినిమా పట్టేశాడు.ఇక నైజాం కింగ్ దిల్ రాజునే తట్టుకొని నిలబడ్డాడు అంటే నిజంగా ధైర్యం అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: