
వాస్తవం ఇది..
వాస్తవంలోకి వచ్చేసరికి ఆఫీసుకువెళితే చుట్టూ పదిమంది ఉంటారు.. మనకు ఏ సహాయం కావాలన్నా వెంటనే అందుతుంది.. వ్యక్తిగత విషయాలను కూడా స్నేహితులతో పంచుకోవచ్చు.. అంత ఒకే కుటుంబంలా ఉండొచ్చు... కానీ ఇప్పుడు లేవు.. ఇంటిదగ్గర కుటుంబ సభ్యులన్నా ఒంటరి అనే భావన. నలుగురులోకి వెళ్లకపోతే వెనకబడిపోతామేమోనన్న ఆలోచన ఇప్పుడు ఉద్యోగస్తులను కుదురుగా ఉండనీయడంలేదు.
పిలిచిన వెంటనే వస్తాం...
‘కరోనా’ మహమ్మారి వల్ల ఇంటి నుంచి పనిచేస్తున్న ఎంతో మంది ఉద్యోగులు ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు వెళ్లి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఉద్యోగాల వెబ్‌సైట్ ‘ఇండీడ్’ సర్వేలో తేలింది. మీరు పిలిచిన వెంటనే కార్యాలయాకు పరిగెత్తుకుంటూ వస్తామని దాదాపు 59% ఉద్యోగులు స్పష్టం చేశారు. ‘ఇక ఎప్పటికీ ఇంటి నుంచి పనిచేయడానికి మేం సిద్ధంగా లేం’ అని ఎక్కువ మంది స్పష్టం చేస్తున్నారు. ఇతరదేశాల్లో ఇంకా ఇటువంటి సానుకూలత పెద్దగా లేదని, మనదేశంలో మాత్రం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం కంటే ఆఫీసులకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది.
ఇది శాశ్వతం కాదు
ఇంటి నుంచి పనిచేసే సదుపాయం కల్పించడం వల్ల చాలా మంది తమ సొంత ఊళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఇది శాశ్వతం కాదని, కరోనా ముప్పు తొలగిపోయి సాధారణ స్థితిగతులు నెలకొంటే, మళ్లీ నగరాలకు వెళ్తామని 50% మంది ఉద్యోగులు చెప్పారు. తమ ఊళ్లలోనే ఉంటామని చెప్పేవాళ్లు 9% మాత్రమే కనిపించారు. కానీ మహిళా ఉద్యోగుల ఆలోచన కొంత భిన్నంగా ఉంది. నగరాల్లో ఉంటూ పనిచేయడం కంటే, తమ స్వస్థలాలకు వెళ్లి పనిచేయడాన్ని ఇష్టపడతామని 60% మహిళా ఉద్యోగులు చెప్పారు. కుటుంబంతో కలిసి ఉండే అవకాశం వస్తుందనే ఆలోచన మహిళా ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఇంటి నుంచి పని కొనసాగించబోమని చెప్పిన యాజమాన్యాలు: 70 శాతం, ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత తగ్గలేదన్న నిర్వాహకులు : 75 శాతం, చిన్న నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నవారు : 30 శాతం.