రోజులో ఎన్నో వింత సంఘటనల గురించి వింటూ ఉంటాము. కొన్ని ఈజీగా నమ్మితే మరికొన్ని వాటిని ఆధారాలను చూపిస్తే కానీ నమ్మలేము. అయితే పంజాబ్, హర్యానా సరిహద్దులో ఉన్న ఒక ఇంటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి ఒక చివరి తలుపు పంజాబ్‌లో తెరుచుకుంటే,  మరొక చివరి తలుపు హర్యానాలో తెరుచుకుంటుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, నమ్మక తప్పదు. అయితే 70 ఏళ్ల జగవంతి దేవి తన కుటుంబమంతో కలిసి ధర్మశాల పక్కనే ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆమె ఇంటి గురించి ఇప్పుడు ఒక పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అయితే 70 ఏళ్ల జగవంతి దేవి తన కుటుంబమంతో కలిసి ధర్మశాల పక్కనే ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఆమె కొంతకాలం క్రితం తన ఇంటిని విస్తరించింది. ఫలితంగా, ఆమె నివాసంలో సగం ప్రాంతం హర్యానా రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది. ఆమె మూడు నెలల క్రితం విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, భూమి రిజిస్ట్రీ ఉర్దూలో ఉండటంతొ  దీనిపై స్థానిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చేసేందేం లేక రిజిస్ట్రీని పంజాబీ భాషలోకి మార్చారు. అలా చేసినా కూడా పని తిన్నగా జరగలేదు.

దీంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రీ ఇంగ్లీషులో తయారుచేశారు. దీంతో తమ ఇంటికి కరెంట్ కనెక్షన్ పక్కా అనుకున్నారు. అయితే దీనిపై విద్యుత్ శాఖ మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఇళ్లు రెండు రాష్ట్రాల్లో ఉండటం వల్ల తాము సర్వీసు ఇవ్వలేమని తెలిపింది. బార్డర్ సరిహద్దు గోడను నిర్మించే వరకు కనెక్షన్ ఇవ్వమని స్పష్టం చేసింది. అందువల్ల, జగవంతి దేవి ఇంటి మధ్యలో గోడను నిర్మించక తప్పలేదు.

అయితే పంజాబ్ నుండి విడిపోయిన తరువాత హర్యానా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఇటువంటి బార్డర్ వివాదాలు చాలా జరిగాయి. మరోసారి ఆ తరహా ఇష్యూ చర్చయానీయాంశం అయ్యింది. ఇంట్లో గోడ నిర్మించడంతో గోడకు అత్తగారు ఒకవైపు, కోడలు మరోవైపు నిల్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండటం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: