జగనన్న ప్రభుత్వం మహిళలకు ఆసరాగా డబ్బులను విడతల ప్రకారం అందజేస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 7వ తేదీ నుంచి వరుసగా పది రోజులపాటు విజయదశమి కానుకగా.. వీరికి రెండో విడత ఆసరా కూడా అందజేస్తామని ప్రకటించారు.. ఇప్పటికే మొదటి విడత తో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత ప్రకటించి, వారి మోములో చిరునవ్వు చూడాలని ఆయన ఎదురు చూస్తున్నారు..

ఈ సందర్భంగా బుధవారం స్పందన కార్యక్రమం లో మాట్లాడుతూ.. అక్టోబర్ నెల 7వ తేదీ నుంచి ఏకంగా పది రోజుల పాటు అక్కచెల్లెమ్మలకు ఈ ఆసరా పథకం గురించి చైతన్య కార్యక్రమాలలో జడ్ పీటీసీ, ఎంపిటిసి సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, సర్పంచులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపాడు.. ఈ కార్యక్రమాలలో ఆసరా చెక్కులు ఇవ్వడమే కాకుండా ఆసరా , దిశ, చేయూత వంటి  మహిళా సాధికారత కోసం ఏ విధంగా అడుగులు వేసామో కూడా ముఖ్యంగా ప్రజలకు వివరిస్తారని ముఖ్యమంత్రి తెలిపాడు..


ఆసరా కింద 6,500 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తోందని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశాడు.. ఈ ఆసరా పథకం కింద 80 లక్షల మందికి పైగా ఉన్న అక్కా చెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపాడు.. అంతేకాదు చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు.. రైతు భరోసా రెండో విడత ను కూడా అమలు చేస్తామని తెలిపారు.. అక్టోబర్ 19వ తేదీన జగనన్న తోడు కార్యక్రమం తో పాటు అక్టోబర్ 1వ తేదీన క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం వస్తున్న డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల గురించి కూడా ప్రజలలో అవగాహన కల్పించాలి అని అధికారులకు జగన్మోహన్ రెడ్డి సూచనలు ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: