ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అందుబాటులో ఉండే ఆయుధం. దీన్ని మనం ఏవిధంగా ఉపయోగిస్తే మనకు ఆ విధంగా లాభం ఉంటుంది. ఇంటర్నెట్తో ఎంతోమంది ఇంట్లో కూర్చునే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మనిషికి కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎలాగైనా బ్రతక వచ్చు. విభిన్నమైన ఆలోచనలు ఉండేవాళ్లకు సంపాదనకు కొదవుండదు. అయితే ఈ యొక్క సోషల్ మీడియాను కొంతమంది మంచి కోసం వాడితే, మరికొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తూ చట్టానికి వ్యతిరేకం అయినా కార్యకలాపాలకు పాల్పడుతూ చివరికి కటకటాలపాలవు తున్నారు.

కొంతమందైతే తమ ఆలోచనలు సానబెట్టి నిజాయితీగా తెలివిగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాగే ఈ యువకుడు కూడా తన తెలివితో కోట్లల్లో సంపాదిస్తున్నాడు మరి ఇంతకు ఆ యువకుడు ఏం చేస్తున్నాడు తెలుసుకుందామా..? ఇండోనేషియాకు చెందినటువంటి ఒక యువకుడు తన సెల్ఫీ లను అమ్ముతూ  చాలా సంపాదిస్తున్నాడు. అదెలా అంటే.. ఇండోనేషియా దేశంలోని సెంట్రల్ సిటీ సేమరాంగ్ యూనివర్సిటీలోని సుల్తాన్ గుస్టాఫ్ ఆల్ గోజాలి  అనే యువకుడు కంప్యూటర్ సైన్స్ చదువుతూ ఉన్నాడు. సుల్తాన్ ఏడు సంవత్సరాలుగా రోజు ఒక సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడు. ఇలా దాదాపు వెయ్యి సెల్ఫీ లను తీసుకున్నాడు. అక్కడే గ్రాడ్యుయేషన్ డే కొరకు టైంలఫ్స్ వీడియోను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంలోనే బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాడు. తను తీసుకున్న సెల్ఫీ లను ఆన్లైన్లో  ఎన్ ఎఫ్ టీలుగా విక్రయించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

 ఒక్క సెల్ఫీ ని మూడు డాలర్లు (223 రూపాయలు ) ధర నిర్ణయించాడు. దీంతో అతను అనుకోకుండానే తన సెల్ఫీ లకు డిమాండ్ పెరిగిపోయింది. మరొకవైపు క్రిప్టో కరెన్సీ మరియు ఈతర్ ఎఫెక్టుతో ఒక్కొక్క సెల్ఫీ 60 వేల రూపాయలు పలికింది. దీనికి తోడు గా ఒక ప్రముఖ సెలబ్రెటీ చెఫ్.. తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో సుల్తాన్ యొక్క సెల్ఫీ లను ప్రమోట్ చేశాడు. దీంతో ఆయన సెల్ఫీ విక్రయాలు మరింత జోరందుకున్నాయి. ఈ విధంగా సుల్తాన్ సుమారు ఏడు కోట్ల రూపాయల పైనే సంపాదించాడు. దీంతో ఈ యువకుడు ప్రస్తుతం  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: