మన దేశంలో రాను రాను మద్యానికి బానిసైన యువకుల పిచ్చి చేష్టలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.కొంతమంది ఆకతాయిలు అయితే బాగా డ్రింక్ చేసి ఆ మత్తులో జోగుతూ చాలా నీచమైన పనులు చేస్తున్నారు.ఇక ఇది చాలదన్నట్టు తామేదో ఘనకార్యం చేసినట్టు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఆ వీడియోలు పెడుతున్నారు. తాజాగా ఇక వీరి వికృత చేష్టలకు పరాకాష్టగా నిలిచే మరో ఘటన చండీగడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు ఫుల్‌గా మద్యంని సేవించి హిందువుల ఆరాధ్య దేవుడు అయిన పరమశివుని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా దీనిపై హిందువులు చాలా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇక ఈ చాలా దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియోలో... ఓ నది ఒడ్డున ఇద్దరు యువకులు బాగా మద్యం సేవించి శివలింగానికి బీర్ తో అభిషేకం చేయడం మీరు ఇందులో గమనించవచ్చు.వైరల్ అవుతున్న ఈ వీడియో లో ఇద్దరు ఆకతాయిలు బూట్లు ధరించి పవిత్రంగా భావించే శివలింగం వద్దకు రావడం చూడొచ్చు.


ఇక ఆ తరువాత వీరు తమ చేతిలో ఉన్న బీర్ బాటిల్స్ లోని మద్యాన్ని శివలింగంపై పోయడం కూడా చూడవచ్చు. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బజరంగ్ దళ్ పార్టీ కార్యకర్తల వీరిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఈ యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనలో ఒక యువకుడు చండీఘడ్ రాష్ట్రంలోని ఐటీ పార్కు సెక్టార్ 26కు చెందినవాడిగా పోలీసులు ఇప్పటికే అతడిని గుర్తించారు. హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా కొలిచే నీలకంఠుడి పట్ల యువకులు వ్యవహరించిన ఈ తీరుపై పలు హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఇంకా అలాగే హిందువుల మనోభావాలు ఎంతగానో దెబ్బ తీసిన ఈ యువకులపై కఠిన చర్యలు అనేవి తీసుకొకపోతే ఆందోళనలు ప్రజ్వరిల్లుతాయని కూడా హిందూ కార్యకర్తలు హెచ్చరించారు. మళ్లీ ఎవరూ కూడా అసలు ఇలాంటి పిచ్చి పనులు చేయడానికే భయపడేలా శిక్షని విధించాలని కూడా డిమాండ్ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: