
ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు అపరిచితులు కూడా వచ్చి పెళ్లి బరాత్ లో డాన్స్ లు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇలా డాన్సులు చేయడానికి వచ్చి గొడవ లు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో పెళ్లిళ్లలో ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. వరుడిని ఎంతో ఘనంగా ఊరేగిస్తున్నారు. ఇక పెళ్లి వేదిక దగ్గరికి ప్రవేశించే సమయంలో కొంతమంది స్నేహితులు ఊరేగింపులో డాన్సులు కూడా చేస్తూ ఉన్నారు.
అయితే ఇక్కడ మాత్రం ఏకంగా రోడ్డుపై వెళ్తున్న కొంతమంది ముక్కు మొఖం తెలియని యువకులు పెళ్లి బరాత్ లో డాన్స్ చేశారు. అయితే ఇలా డాన్స్ చేయడానికి ముందు గుర్రపు బండిలో కూర్చొని ఊరేగుతున్న వరుడు పర్మిషన్ కూడా తీసుకున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే వరుడు అనుమతి ఇవ్వడంతో బ్యాండ్ బాజా లను దాటుకుంటూ వెళ్లి భారత్లో దూరూతారు. ఇష్టం వచ్చినట్లుగా చిత్రవిచిత్రంగా డాన్సులు చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో మందికి నవ్వు తెప్పిస్తుంది ఈ వీడియో.