సాదరణంగా పెళ్లి జరుగుతుంది అంటే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయబడిన పెళ్లి పందిరిలో భాజా భజంత్రీల వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా వివాహ వేడుక జరుగుతున్నప్పుడు వధువు, వరుడు స్నేహితులదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక స్నేహితులందరూ ఒక్కచోట చేరి వధూవరులను ఎలా ఆటపట్టించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు సరికొత్తగా ఆలోచిస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారూ.


 సాధారణంగా ఇక పెళ్లి చేసుకున్న వధూవరులు స్టేజిపై ఇక అక్కడికి వచ్చిన బంధుమిత్రులందరితో కలిసి ఫోటోలు దిగుతూ ఉండడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా వధూవరులు ఫోటోలు దిగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఒక లేడీ ఏకంగా వరుడుని తన కౌగిలిలో బిగించేస్తే పక్కనే ఉన్న వధువు ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. స్టేట్ మీదికి వచ్చిన ఒక అమ్మాయి వరుడుని  గట్టిగా కౌగిలించుకుంది. దీంతో పక్కనే ఉన్న వధువు షాక్ అయింది. ఇక అక్కడ ఉన్న బంధుమిత్రులందరూ కూడా ఆ అమ్మాయి ఏంటి వరుడిని కౌగిలించుకోవడం ఏంటి అని షాక్ లో ఉన్నారు. కానీ ఇంతలో అసలు ట్విస్ట్ బయటపడింది.


 వరుడుని కౌగిలించుకుంది అసలు అమ్మాయి కాదని ఏకంగా వరుడు స్నేహితుడే అని.. ఇలా ఆటపట్టించడానికి సరికొత్తగా ప్లాన్ చేశారు అన్న విషయం బయటపడింది. దీంతో వధువు సైతం ఒక్కసారిగా నవ్వుకుంది అని చెప్పాలి. విషయం తెలిసిన తర్వాత వరుడు గట్టిగా నవ్వుతూ ఫ్రెండ్ తలపై గట్టిగా కొట్టాడు. చుట్టూ ఉన్న వారంతా కూడా కాసేపు నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నేటిజన్స్.. పెళ్లికి పిలిచే ముందు జాగ్రత్త ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: