సాధారణంగా మన దేశంలో ఊర కుక్కలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా కొన్ని కొన్ని సార్లు మనుషులపై దాడి చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయ్. ఇక ఇటీవల కాలంలో ఊర కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. అయితే మన దేశంలో ఊర కుక్కలు ఎలా ఉంటాయో అలాగే అటు అమెరికాలో రకున్ అనే జంతువులు ఉంటాయి.


 తరచూ జనావాసాల్లో తిరుగుతూ ఉంటాయి ఈ జంతువులు. అయితే ఇవి ఎక్కువగా మనుషులపై దాడి చేయవు.. అప్పుడప్పుడు మాత్రం దాడి చేసి గాయపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. పిల్లి కంటే పెద్దగా కుక్క కంటే చిన్నగా ఉండే ఈ జంతువులు దాదాపు 9 కేజీల వరకు బరువు పెరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఇటీవలే ఒక రకున్ అమెరికాలోనే కనెక్టటెట్ ప్రాంతంలో ఒక స్కూల్ విద్యార్థిపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అక్కడికి  వచ్చిన రకున్ ఏకంగా చిన్నారి కాలును గట్టిగా కొరికేసింది.


 ఒకసారిగా భయపడి పోయిన బాలిక కేకలు వేసింది. ఇక ఆ అరుపులతో ఒకసారిగా అప్రమత్తమైన తల్లి గబగబా వచ్చి ప్రాణాలకు తెగించి రకున్ ను పట్టుకుంది. ఆ పాపను విడిపించింది. అయితే అప్పటికే ఆ రకున్ ఆ మహిళ చేతిని గట్టిగా కొరకడం మొదలు పెట్టింది. ఇక ఎంతో కష్టపడి ఆ రకూన్ ను గాల్లోకి విసిరేసి తాను కూడా ఇంట్లోకి వెళ్లి డోర్ పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి ఎంతోమంది షాక్ అవుతున్నారు. ఏకంగా ప్రమాదం ఎదురైనప్పుడు ఆమె సమయస్పూర్తిగా వ్యవహరించిన తీరు బాగుంది అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: