
డీజీపీ ఐ నోంగ్రాంగ్ మాట్లాడుతూ ఒక నిందితుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నారని వారిని అదుపులోకి తీసుకున్నామని మరో ఇద్దరు ఎస్ఐటి ఇండోర్లో అరెస్టు చేశామంటూ తెలిపారు. ప్రధాన నిందితురాలు సోనమ్ అంటూ తెలియజేయడం జరిగింది. ఆమె ఉత్తరప్రదేశ్లోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా తెలియజేశారు. అక్కడ కొంతమంది టూర్ గైడ్లను పోలీసులు విచారించగా పోలీసులకు తెలిపిన ప్రకారం ఈ జంటతో పాటు మరొక ముగ్గురు వ్యక్తులు కూడా వారి వెంటే ఉండేవారని తెలిపారట. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఈ కేసును చేదించామంటూ తెలియజేశారు.
ఈ కేసులో మధ్యప్రదేశ్ యూపీ నుంచి ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.. ఇందులో ప్రధాన నిందితురాలు అయిన మృతుడి భార్య సోనమ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. మే 11న ఈ జంట వివాహం తర్వాత హనీమూన్ కు మేఘాలయా లోని షిల్లాంగ్ కు వెళ్లారు.. అక్కడికి మే 20వ తేదీకి చేరుకున్నారు. అదే నెల 23వ తేదీ మాత్రమే కుటుంబ సభ్యులతో చివరిగా మాట్లాడారట. ఆ తర్వాత వీరు మొబైల్స్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. జూన్ రెండవ తేదీన సోడాంగ్ జలపాతం సమీపంలో ఉండే ఒక లోయలో రఘువంశి డెడ్ బాడీ కనిపించింది. దీంతో పోలీసులు మరణించిన రఘు భార్య సోనమ్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కిడ్నాప్ లేదా ఏదైనా అక్రమ రవాణా జరిగిందా అని అనుమానాలతో విచారం చేపట్టారు.. కానీ చివరికి నిందితులను పట్టుకోవడంతో స్వయంగా సోనమ్ పోలీసులకు లొక్కిపోయింది. మరి ఈ జంటకు ఏం జరిగింది ఎలా మరణించారనే విషయంపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.