మనిషి జీవన విధానంలో నాటికి నేటికి ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పిల్లలు, యువత పెరిగిన వాతావరణం వేరు ఇప్పుడు పిల్లలు, యువత ఉన్నటువంటి, చూస్తున్నటువంటి సమాజం వేరు. అప్పట్లో యువత అంటే తల్లితండ్రుల పర్మిషన్ లేనిదే కనీసం గడప దాటేవారు కాదు. ఫోన్లు, నెట్ సెంటర్లు ఇవన్నీ లేవు. కాబట్టి లోక జ్ఞానం పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పట్లో రెండవ తరగతి చదివే పిల్లాడి నుండి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్లు, ఫేస్బుక్ , వాట్సాప్ అంటూ ప్రపంచమే చేతిలో ఉంటుంది. వీటన్నిటి వలన ఎంతగా అయితే ఉపయోగం మంచి ఉందో అదే విధంగా ఎంతో కొంత చెడు కూడా ఉంది.

ఇవన్నీ యువత భవిష్యత్తును బాగా ప్రభావితం చేస్తున్నాయి. మంచైనా, చెడైనా ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా చేతిలో ఫోన్ ఉంటే చాలు చిటికెలో అంతా మన కళ్ళ ముందు ఉంటుంది. సమాచార సేకరణకు ఇంటర్నెట్లు కూడా కేంద్రంగా మారుతున్నాయి. అయితే మంచిని తీసుకుంటే పర్వాలేదు. కానీ వీటి వలన చెడు త్రోవ పడితే వారి భవిష్యత్తే నాశనం అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు డిగ్రీలు చదువుతున్న వారికి కూడా వారి తల్లి తండ్రులు ఫోన్లు కొనిచ్చే వాళ్లు కాదు. ఇప్పటి జనరేషన్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి కూడా వాళ్ళ తల్లితండ్రులు మంచి మంచి ఫోన్లు, టాబ్ లని కొనిపెడితున్నారు. కారణం వారికి చదువుకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకుని మరింత ప్రతిభావంతులుగా తయారవుతారని ఒక ఆలోచన.

అయితే ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్ గమనించాల్సిన విషయం. తమ పిల్లలు వాటిని సరైన రీతిలో వారి చదువు కోసం  వినియోగిస్తున్నారా లేదా మరేదైనా చెడు మార్గంలో పయనిస్తున్నారా అని గమనించడమే కాకుండా వారికి తరచూ కొన్ని జాగ్రత్తలను చెబుతుండాలి. ఒక పరిధి వరకే ఇంటర్నెట్ ను ఉపయోగించాలని వారికి చెబుతూ ఉండాలి. ముఖ్యంగా యువతను ఒక కంట కనిపెడుతుండాలి. తల్లి తండ్రులు ఎప్పుడూ వారికి సున్నితంగానే మంచి విషయాలను తెలియచేయాలి. ఒకవేళ వారి పద్దతి మంచిగా లేకపోయినప్పటికీ నిదానంగానే వారికి అర్థమయ్యేలా పలుమార్లు వివరించే ప్రయత్నం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: