ఎందులో అయినా విజయం అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తారు. ముఖ్యంగా వ్యాపారం చేయాలి అనుకునేవారు ఎటువంటి నష్టాలు లేకుండా లాభాలతో తమ వ్యాపారం విజయవంతంగా సాగాలని కోరుకుంటారు. అయితే ఇపుడు నష్ట భయం పెద్దగా లేని, అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్న ఒక వ్యాపారం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత జనరేషన్ లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న విషయం విదితమే. అయితే కాలుష్యాన్ని తగ్గించేందుకు సమాజంలో వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కంపోస్ట్ వ్యాపారం ఒక చక్కటి అవకాశం. వేస్ట్ పదార్థములతోనే కంపోస్ట్ తయారు చేయబడుతుందన్న సంగతి తెలిసిందే. తద్వారా వ్యర్ధాలను తగ్గించడమే కాకుండా వాటివల్ల తయారయిన కంపోస్ట్ ని మొక్కలకు, చెట్లకు అందించడం ద్వారా పర్యావరణానికి కూడా ఒకరకంగా మేలు చేసిన వారు అవుతారు.

అంతే కాదు ఈ వ్యాపారానికి పోటీ తక్కువ డిమాండ్ ఎక్కువ ఉండడంతో మనకు ఇదో మంచి వ్యాపార అవకాశం.  కంపోస్ట్ ను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదు. కూరగాయల ద్వారా వచ్చే ఆకులు, పీచులు, తుక్కు మరియు కుళ్ళిన కూరగాయలు అలాగే కొబ్బరి పీచు, చెట్ల నుండి రాలే ఆకులు, కాయలు, పండ్లు  కుళ్లిపోయిన కూరగాయలు వంటిని వినియోగించి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇంకా క్లారిటీ కావాలంటే కంపోస్ట్ తయారీ విధానం గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా మరో వైపు  ప్రభుత్వం కూడా కంపోస్ట్  వ్యాపారం చేసే వారిని బాగా ప్రోత్సాహం అందిస్తోంది. కంపోస్ట్ వ్యాపారం గురించి అవగాహన పెంచే  ట్రైనింగ్ ఇస్తున్నది.

 ప్లానింగ్

* కంపోస్ట్ తయారీకి మీకు పెద్ద స్థలం అవసరం. అది కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పల్లెల దగ్గర లేదా నగరానికి కాస్త దూరంగా స్థలాన్ని తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎవరి వల్ల మీకు సమస్య ఉండదు. మీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. లేదంటే మీకు సౌకర్యంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు.

* కంపోస్ట్ ను తయారు చేసుకోవడానికి ముడి సరుకు అవసరం. కాబట్టి ముఖ్యంగా మార్కెట్, హోటల్స్, తోటల వంటి వాటి వద్ద వచ్చే ఆకులు, తొక్కు వంటి చెత్తను ప్లాస్టిక్ కలవకుండా విడిగా తీసిపెట్టమని వారితో కొంత డబ్బుకి డీల్ కుదుర్చుకోవాలి. అది వారికి ఎలాగో వేస్ట్ కాబట్టి తక్కువ డబ్బులకు మీకు ఇచ్చేస్తారు. అలా ముడిసరుకు తక్కువ ధరకే దొరుకుతుంది.

* ఇక మీరు తయారు చేసిన కంపోస్ట్ ను ఎలా విక్రయించి లాభాలు అందుకోవాలి అంటే. ప్రస్తుతం ఆన్లైన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. కాబట్టి ఆన్లైన్ లోనే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే,  వంటి ఈ-కామర్స్ సైట్లతో మీరు టై-అప్ అయ్యి  మీరు తయారు చేసిన కంపోస్టును సరసమైన ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది.

కాబట్టి ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: