కష్టాలు సమస్యలు ఒక ఎత్తు అయితే శత్రువుల నుండి ఎదురయ్యే ప్రతికూలతలు మరో ఎత్తు అని చెప్పాలి. కానీ ఈ లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే శత్రువు ఎంతటి వాడు అయినా ఎదిరించి ముందుకు వెళ్లాలి. లేదంటే నీ జీవితంలో విజయం అనే దాని రుచి కూడా చూడలేవు. ఈ శత్రువులు కొందరికి మైనస్ అయితే మరి కొందరికి ప్లస్ అవుతారు అని చెప్పవచ్చు. మనము ఎటువంటి పరిస్తితిలో ఉన్నా మనల్ని ఈ శత్రువులే అలెర్ట్ చేస్తూ ఉంటారు. మనము అన్ని సమస్యలను ఎదుర్కోవడానికి శక్తిని పరోక్షంగా ఇస్తూ ఉంటారు. మనము సాధించే విజయంలో శత్రువులు కూడా ఒక కారణంగా నిలుస్తారు.
అయితే శత్రువులు అందరూ ఒకేలా ఉండరు. అంతే కాకుండా శత్రువు అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉండరు. వివిధ రకాలుగా ప్లాన్ చేసి మనల్ని ఓడించడానికి పదే పదే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే మన శత్రువును అంత ఈజీగా తీసుకోకూడదు. శత్రువు మీ నాశనం కోరుకుంటాడు కాబట్టి ప్రతి క్షణం వారిని కనిపెడుతూ ఉండాలి. ఎప్పుడు ఏ వైపు నుండి వచ్చి దెబ్బ కొడుతాడో తెలియదు. అందుకే మీరు వంద రకాల ప్లాన్స్ తో రెఢీ గా ఉండాలి. అప్పుడే శత్రువు పన్నిన పన్నాగాలను బద్దలు కొట్టి విజేతగా నిలుస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి