శాస్త్రాన్ని నమ్మడం ఇపుడు కొత్తగా వచ్చింది కాదు. మన పురాతన కాలం నుండి శాస్త్రాలను నమ్ముతూ వస్తున్నారు. అయితే ఇపుడు కాస్త నమ్మకాలు తగ్గాయి. కానీ... ఇప్పటికీ శాస్త్రాలను విశ్వసిస్తూ వాటిని పాటించే వారు చాలా మందే ఉన్నారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని చేరాలనుకునే వారు కొన్ని శాస్త్ర నియమాలను పాటించాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

హిందూ మతంలో ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు. ఆదివారాన్ని సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు. ఆదివారం నాడు  భక్తులు ఉపవాసం ఉండి కోరుకున్న కోరికలు తీరాలని విజయం అందుకోవాలని కోరుకుంటారు . సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలనుకునే వారు రవి వారం నాడు ఇలా ప్రత్యేకంగా పూజ చేయడం వలన విజుయులు అవుతారని ఒక విశ్వాసం.  అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆదివారం రోజు కొన్ని పనులు చేయకూడదని అలా చేయడం వలన కోరుకున్న లక్ష్యాలను చేరుకోలేరని. ఒకవేళ  అలాంటి పనులు చేస్తే సూర్య భగవానుడికి అనుగ్రహానికి దూరం అవుతారని సూర్యునికి ఆగ్రహం వస్తుందని, మీ జీవితంపై హానికరమైన ప్రభావాలు పడతాయని చెబుతారు.

ఇంతకీ ఆ పనులు ఏంటో ఇపుడు తెలుసుకుందాం.  

ఆదివారం రోజున రాగితో తయారు చేసిన వస్తువులను కొనడం కానీ, అమ్మడం కానీ చేయకూడదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆదివారం కదా అని సూర్యుడు నెత్తి పైకి వచ్చే వరకు నిద్రలేవరు కొందరు... కానీ ఇలా చేస్తే సూర్యునికి ఆగ్రహం వస్తుంది. పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసుకుని నిత్య జీవన కలాపాలు మొదలు పెట్టాలి.
ఆదివారం నుండి ప్రతిరోజూ 108 సార్లు సూర్య మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన అనుకున్న విజయాన్ని అందుకోవచ్చట. మరి ఇంకెందుకు ఆలస్యం ఇక మీదట పైన చెప్పిన విధంగా చేసినట్లయితే మీరు తలపెట్టిన అన్ని పనులు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: