వారిద్దరూ భారత్ కు చెందిన నవ దంపతులు. ఇటీవలె వారికి వివాహమైంది. నిండునూరేళ్లు పిల్లాపాపలతో జీవించాల్సిన వారికి ఓ ప్రమాదం వెంటాడింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర ప్రమాదంలో వారిరువురూ దుర్మరణం పాలయ్యారు. నవ దంపతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో భారత నవ దంపతులు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానిక ప్రాంతంలో కలకలం రేపింది. 

 

పోలీసుల సమాచారం మేరకు.. కేరళలోని వెంగోల ప్రాంతంలో వలసాల తొంబర హౌజ్‌ కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ మాథ్యూస్ కుమారుడు అల్బిన్ మాథ్యూస్ (30)కు, కొత్తమంగళంకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఎల్డో కుమార్తె నిను సుసేన్ (28)కి 2019వ సంవత్సరం అక్టోబర్ 28న వివాహం జరిగింది. ఆపై నవంబర్ 20న ఇద్దరూ ఆస్ట్రేలియాకు వెళ్లారు. నిను సుసేన్ ఆస్ట్రేలియాలోని ఓ ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తోంది. ఈ క్రమంలో న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో నవ దంపతులు ఇద్దరూ కారులో వెళుతుంటే ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇద్దరి మరణ వార్తను తెలుసుకున్న రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

న్యూ సౌత్‌వేల్స్‌లో శుక్రవారం ఉదయం 6 గంటలకు ఈ దంపతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వెంగోలలోని వలసాల తొంబర హౌజ్‌కు చెందిన అల్బిన్ తండ్రి మాథ్యూస్ రిటైర్డ్ ఎస్ఐ. కొత్తమంగళంలోని సరమ్మ పుతుమనక్కుడియిల్‌ హౌజ్‌కు చెందిన నిను తండ్రి ఏల్ధో రిటైర్డ్ ఎల్ఐసీ ఆఫీసర్. నవ దంపతుల మృతితో ఇరువురి కుటుంబాలలో విషాదం నెలకొంది.  

 

ఇద్దరి మరణవార్త వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పెళ్లైన  రెండు నెలలకే ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆస్ట్రేలియాలో భారత నవ దంపతుల దుర్మరణం వార్త పులువురిని కంటతడి పెట్టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: