చాలా మంది మ‌గ‌వారు శృంగారంలో అమ్మాయిల‌తో మృదువుగా కాకుండా కాస్త కఠినంగా ప్ర‌వర్తిస్తూ ఉంటారు. వారి మొర‌టిత‌నంతో సెక్స్ అంటేనే విసుగు వ‌చ్చేలా చేస్తుంటారు. మ‌రికొంత‌మంది అయితే అస‌లు సెక్స్‌లో పాల్గొనాలంటేనే భ‌య‌ప‌డ‌తారు. అలాంటి వారికోసం కొంత మంది వైద్య నిపుణులు చెప్పే స‌ల‌హాలు చూద్దాం. అలాంటి దాంప‌త్య జీవితం స‌జావుగా సాగాలంటే దంప‌తులిద్ద‌రి మ‌ధ్య ఏ విష‌యంలోనైనా స‌రైన అవ‌గాహ‌న ఉండాలి. 

 

ఒక్క శృంగారంలోనే కాక ప్ర‌తి విష‌యంలోనూ ఒక‌రి ఆలోచ‌న మ‌రొక‌రు పంచుకునేలా ఉండాలి. అలా కాకుండా ఒక‌రి పై మ‌రొక‌రు అధికారం చెలాయించే రేంజ్‌లో ఉంటే ఆ దాంప‌త్యాన్ని ఏమీ చేయ‌లేము. అందుకోస‌మే చాలా మంది భ‌ర్యాభ‌ర్త‌లు స‌ల‌హాల కోసం డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంటారు. వారిలో చాలా మంది శృంగారం విషయంలో కొందరు భార్యలదే తప్పు అని చెబుతుంటే.. మరికొందరు కాదు.. మా భార్తలదే త‌ప్ప‌ని చెబుతుంటారు. పెళ్లిళ్లు అయిన కొత్త‌లో భ‌ర్త‌లు భార్య ఎలా చెబితే అలా వింటారు. త‌ర్వాత రాను రాను వాళ్ళ మాట విన‌డం మానేస్తారు దాంతోనే ఇద్ద‌రికి మ‌న‌స్ప‌ర్ద‌లు ఎదురై చివురికి సంసార సుఖానికి కూడా దూర‌మ‌వుతారు.

 

చాలా మంది భార్య‌లు  తమ‌ పనులు చేయించుకోవడం కోసం, తన మాట నెగ్గించుకోవడం కోసం సెక్స్‌ను అస్త్రంలా వాడుతుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే ఒక‌రికి ఒక‌రు దూర‌మ‌వుతుంటారు. ఇలానే తరచూ జరిగితే భార్యపై భర్తకు ప్రేమ తగ్గిపోతాయి.. తర్వాతర్వాత కోరికలు కూడా కలగవని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.ఏవైనా ఉంటే..ముందుగానే సామరస్యంగా పరిష్కరించుకోవాలని... ఇలా ప్రతిదానికీ బెడ్రూమ్ తో ముడిపెట్టకూడదని చెపుతున్నారు. దాని వ‌ల్ల భ‌విష్య‌త్తులో భ‌ర్త వేరే స్త్రీకి అల‌వాట‌య్యే ప్ర‌మాదం కూడా ఉంది. నాకు శృంగారంపై ఆసక్తి ఎక్కువ. కానీ ఆ ఆసక్తిని నా భర్త మొరటుతనంతో పొగొడుతున్నాడు. వింత వింత సెక్స్ పొజీష‌న్స్ కాదంటే క‌సురుకోవ‌డం, తిట్ట‌డం కొట్ట‌డం చేస్తుంటారు దీంతో భ‌ర్త పైన ప్రేమ అనేది చాలా వ‌ర‌కు త‌గ్గిపోతుంది. మీకు ఇబ్బందికరంగా ఉన్న విషయాన్ని శృంగార సమయంలో కాకుండా... వేరే సమయంలో మీ భర్తకు వివరించే ప్రయత్నం చేయాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే భ‌ర్య‌లు ఎలాంటి పొజీష‌న్స్ అయితే ఇష్ట‌ప‌డ‌తారు దేన్నిబాగా ఎంజాయ్ చేస్తారు లాంటి విష‌యాలు ఓపెన్‌గా భ‌ర్త‌తో మాట్లాడ‌టం వ‌ల్ల కొంత వ‌ర‌కు ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: