మందారం ఆకులను, మందారం పూలను మెత్తగా నూరి, పేస్ట్ లాగా తయారు చేసి, ఈ మిశ్రమాన్ని మరుగుతున్న కొబ్బరి నూనెలో వేయాలి. ఆ తర్వాత నూనెను వడగట్టి, చల్లార్చు కోవాలి.అయితే వారానికి ఒకసారి రాత్రి పడుకునే ముందు ఈ నూనెను గోరువెచ్చగా చేసుకుని, తలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా సిల్కీ గా, షైనింగ్ గా ఉంటుంది.