మారుతి సుజుకి నుండి సరికొత్త వెహికల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. నెక్సా డీలర్ షిప్ చైన్ ద్వారా అమ్ముడయ్యే ఈ వెహికల్ సిక్స్ సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. సుజుకి ఎర్టిగా ఎం.పి.వి మోడల్ లానే ఈ సరికొత్త వెహికల్ కూడా వస్తుంది. ఈ కొత్త వెహికల్ ఆగష్టులో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మారుతి సుజుకి ఎర్టిగా బాడీ ప్యానెల్ తో వస్తున్న ఈ వెహికల్ 1.5 పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ తో ఈ వెహికల్ అధునాతన టెక్నికల్ అప్డేట్స్ తో వస్తుంది. మారుతి నుండి వస్తున్న ఈ వెహికల్ ట్రైల్ రన్ పూణెలో జరిపారు. మారుతి సుజుకి సేల్స్ మరింత పెంచేలా సుజుకి సిక్స్ సీటర్ వెహికల్ రాబోతుంది. 


దేశీయ మార్కెట్ లో మారుతి సుజుకి సేల్స్ బాగా ఉంటాయి. లక్సరీ వెహికల్స్ ఎన్ని వస్తున్నా సరే మారుతి సుజుకి తమ కస్టమర్స్ ప్రయోజనాల దృష్ట్యా కొత్త వెహికల్స్ లాంచ్ చేస్తుంది. త్వరలో రాబోతున్న ఈ సుజుకి సిక్స్ సీటర్ వెహికల్ ఎర్టిగా, సియజ్ వెహికల్స్ సేల్స్ ను మించుతుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: