టాటా నుండి మరో కొత్త వెహికల్ లాంచింగ్ కు రంగం సిద్ధమవుతుంది. భారతీయ మార్కెట్ లో టాటా కార్ల హవా ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. టాటా ఆల్ట్రోజ్ మరింత టెక్నికల్ అప్డేట్ తో రిలీజ్ అవుతుంది. ఈ సరికొత్త టాటా ఆల్ట్రోజ్ ఈ ఏడాది చివరన డిసెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.


ఈ వెహికల్స్ రెండు పెట్రోల్ మోటర్స్ ఇంకా డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంటుంది. టాటా నుండి వస్తున్న ప్రీమియం హ్యాక్ బ్యాక్ మోడల్ గా ఆల్ట్రోజ్ రాబోతుంది. ఇది బి.ఎస్ 4 నాంస్ తో వస్తుంది. ఈ వెహికల్ ఆల్ఫా ఫ్లాట్ ఫాం మీద ఆధారపడి వస్తుంది. టాటా నుండి వస్తున్న ఈ వెహికల్ వైడెస్ట్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పొచ్చు.


1.2 లీటర్ నాచురల్ పెట్రోల్ మోటర్ తో 84 బి.హెచ్.పి పవర్ ఇంజిన్ తో ఈ వెహికల్ వస్తుంది. టాటా నుండి వస్తున్న ఈ సరికొత్త ఆల్ట్రోజ్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి. ఈమధ్య టాటా వెహికల్స్ సేల్స్ బాగా పడిపోయాయి. మరి రాబోతున్న ఆల్ట్రోజ్ సేల్స్ పెంచేలా చేస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: