చాలా మంది కూడా యుక్త వయస్సు నుంచి మొటిమల సమస్యతో సతమతం అవుతూ అవి తగ్గక చాలా రకాలుగా ఇబ్బందిపడుతూ ఉంటారు.అయితే కొన్ని హోమ్ టిప్స్ ఉపయోగించి మనం చాలా ఈజీగా ముఖం పై వచ్చే మొటిమలతో పాటు చర్మం పై ఉండే జిడ్డును కూడా చాలా సింపుల్ గా తొలగించుకోవచ్చు. మొటిమలను నివారించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి  మనం 20 ఎమ్ ఎల్ బాదం పాలను, 10 ఎమ్ ఎల్ రోజ్ వాటర్ ను, 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును ఇంకా 10 చుక్కల బాదం నూనెను అలాగే ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ను వాడాల్సి ఉంటుంది. అయితే బాదం పాలను మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు.ఈ బాదం పప్పును నానబెట్టి మిక్సీ లో వేసి దాన్ని మెత్తగా పేస్ట్ గా చేయాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ను ఒక వస్త్రంలోకి తీసుకుని చేత్తో గట్టిగా పిండగా వచ్చిన ఆ బాదం పాలను సేకరించాలి. ఇలా చేయడం వల్ల బాదం పాలు ఈజీగా తయారవుతాయి. ఒక గిన్నెలో ఈ బాదం పాలతో పాటు పైన చెప్పిన పదార్థాలన్నీంటిని వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా ప్యాక్ లా వేసుకోవాలి.


ఇక అది ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్ ని వాడడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.ఇంకా అలాగే మొటిమలతో పాటు మొటిమల వల్ల కలిగే మచ్చలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే చర్మం పై జిడ్డు తొలగిపోయి చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే మొటిమలను తగ్గించడంలో కలబంద గుజ్జు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనిని చర్మానికి రాసుకుని ఆరిన తరువాత నీటితో శుభ్రంగా కడిగి వేయాలి.ఇక ఈ కలబంద గుజ్జును వాడడం వల్ల దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాలను చంపి వాటి వల్ల చర్మం పై కలిగే ఇన్ఫెక్షన్ ను కూడా తగ్గిస్తాయి. అలాగే దీనిని వాడడం వల్ల చర్మం చాలా మృదువుగా కూడా తయారవుతుంది. ఈ రెండు టిప్స్ వాడడానికి పది నిమిషాల ముందు ముఖానికి ఆవిరి పట్టుకుంటే చాలా మంచిది. ఇలా ముఖానికి ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మ కణాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు అన్ని కూడా చాలా ఈజీగా చెమట రూపంలో బయటకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: