రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.కాబోయే రాష్ట్రపతి ఎవరనే ఉత్కంఠ అంతటా నెలకొంది. అయితే.. మన దేశంలో ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతులయ్యే సంప్రదాయం కూడా ఉంది. అయితే అది అన్నిసార్లు కాదు.. కానీ.. ఒక్క సారి చరిత్ర చూసుకుంటే.. మన దేశంలో ఇప్పటి వరకూ 13 మంది ఉప రాష్ట్రపతులుగా పని చేశారు. వారిలో మొదటి ముగ్గురు ఉపరాష్ట్రపతులు  ఆ తర్వాత రాష్ట్రపతులు కూడా అయ్యారు. ఆ తర్వాత మళ్లీ వరుసగా ముగ్గురు ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతులు కాకుండానే నిష్క్రమించారు. మళ్లీ ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురు ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతులు అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ముగ్గురు ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు కాలేదు. సో.. ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే.. వెంకయ్య కంటే ముందు ముగ్గురు ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతులు కాకుండానే వెనుదిరిగారు. కాబట్టి ఇప్పుడు మళ్లీ వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ లాజిక్ ఈసారి వర్కవుట్ అవుతుందో లేదో తేలాలంటే వచ్చే నెల 18 వరకూ వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: