y ఒక బౌల్ లోకి ఒక పావు కప్పు నీటిని తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి, ఆ తర్వాత వైట్ వెనిగర్ పావు కప్పు తీసుకోవాలి. మొత్తం మిశ్రమంలా తయారుచేయాలి. ఒకవేళ మీ దగ్గర మైక్రో వేవ్ ఉంటే 30 సెకండ్లు వేడి చేయండి . లేదంటే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసి స్ప్రే బాటిల్లో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు జుట్టుకు బాగా పట్టించి అరగంట ఆరిన తర్వాత,కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో గోరువెచ్చని నీరు ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.