ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి పొరల్లో పేరుకొన్న దుమ్ము,ధూళిని నిర్మూలించడానికి ఆవిరి సహాయపడుతుంది. ఫలితంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడం సులభం అవుతుంది. ఆవిరి పట్టడం వల్ల మన ముఖంమీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా సహజమైన ఆరోగ్యకరమైన కాంతి మీ చర్మానికి సంతరించుకుంటుంది.