పుచ్చకాయ రసం లో పుదీనా రసం కలుపుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల సహజసిద్ధంగా ముఖం కాంతివంతమవుతుంది. అలాగే పుచ్చకాయ రసంలో తేనె కలుపుకొని వాడడం వల్ల మంచి టోనర్ గా పనిచేస్తుంది. ఇక ముడతలు, మచ్చలు ఉంటే పుచ్చకాయ రసంలో నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు అప్లై చేసి పొద్దున్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి