ఒక గిన్నెలో మీ జుట్టుకు సరిపడా గోరింటాకు పౌడర్ ను తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, ఒక కప్పు పెరుగు, నాలుగు టేబుల్ స్పూన్ల టీ డికాక్షన్, ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నీ వేసి మెత్తగా పేస్టు లాగా తయారు చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా నున్నటి పేస్టు లాగా తయారు చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను తయారు చేసి పెట్టిన గిన్నె పైభాగానా ఒక కవరు మూసి టైట్ గా కట్టాలి. గోరింటాకు హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే జుట్టు కొనలు చిట్లి పోయినట్లు వున్నా, మధ్యలో బ్రేక్ అవుతున్నట్లు ఉన్న ఈ హెయిర్ ప్యాక్ మంచిగా పని చేస్తుంది. అంతేకాకుండా జుట్టుకు కావలసిన చల్లదనం కూడా ఈ ప్యాక్ అందిస్తుంది. జుట్టు తెల్లగా ఉన్నట్టు ఉంటే అది కూడా కలర్లోకి వస్తుంది. కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు.