ఉల్లిపాయలో ఉండే " క్యాంపీఫెరాల్ అలాగే క్వర్సెటిన్" అనే రసాయనాలు జుట్టు కుదుళ్ళకు ఉండే రక్తనాళాలు వ్యాకోచం చెందేలా చేస్తాయి. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లలో వుండే కెరటోనాయిడ్స్ ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఫలితంగా కెరటిన్ కలిగిన జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉల్లిపాయలో ఉండటం వల్ల, జుట్టు కుదుళ్ల మీద ఏర్పడే ఫంగస్ లేదా బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది.