
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు చర్మ సంరక్షణ పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మన చర్మతత్వానికి ఏది సెట్ అవుతుందో, ఒకసారి, చూసుకొని మరీ ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగానే క్రీములు,మాయిశ్చరైజర్లు,లోషన్లు వంటివి ముఖానికి రాస్తూ, ఎండ కారణంగా, కాలుష్యం కారణంగా ఏర్పడే సమస్య లను ముఖాన్ని కాపాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది చర్మ సంరక్షణలో ఉపయోగించే స్కిన్ ప్రోడక్ట్స్ లో ఫేషియల్ సీరం కూడా ఒకటి. ఈ సీరం వాడడం వల్ల చర్మం డ్యామేజ్ అవకుండా ఉంటుంది అని వైద్యులు కూడా చాలామందికి సజెస్ట్ చేస్తున్నారు..
అయితే మార్కెట్లో సీరం కొనాలి అంటే చాలా ధర ఎక్కువ. అయితే తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. అయితే ఈ సీరం ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఎక్కడ చదువు తెలుస్తుంది..
సీరం తయారీ విధానాన్ని కి కావలసిన పదార్ధాలు :
రోజ్ వాటర్ - 8 టేబుల్ స్పూన్లు,
విటమిన్ సి పౌడర్ - ఒక టేబుల్ స్పూన్,
గ్లిజరిన్ - ఒక టేబుల్ స్పూన్,
విటమిన్ ఈ క్యాప్సిల్స్ - 2.
తయారీ విధానం :
ఒక బౌల్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగి, కాటన్ వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత ఆ గిన్నెలోకి ఎనిమిది టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ విటమిన్ సి పౌడర్, ఒక టేబుల్ స్పూను గ్లిజరిన్ అలాగే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా మిశ్రమములా తయారు చేయాలి. ఈ ఆయిల్ బాగా మిక్స్ చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి..
దీని ఉపయోగాలు ఏమిటంటే :
సీరం ను ముఖానికి అప్లై చేయడం వల్ల డ్యామేజ్డ్ స్కిన్ ను రిపేర్ చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మొటిమలు మిగిల్చిన మచ్చలను దూరం చేస్తుంది. అలాగే ముడతలు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇక పిగ్మెంటేషన్ నుంచి దూరంగా ఉంచుతుంది. మరీ ముఖ్యంగా విటమిన్ సి తో తయారు చేసిన సీరం ను ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయని డెర్మటాలజిస్ట్ లు సైతం చెబుతున్నారు..