చాలా మందికి కూడా తమ ముఖ చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవాలని ఉంటుంది. ఈ క్రమంలోనే మార్కెట్ లో దొరికే స్కిన్ వైట్నింగ్ క్రీములను కొనుగోలు చేసి ఎక్కువగా వాడుతుంటారు.అయితే వాటి వల్ల  ప్రయోజనం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ని వాడితే మాత్రం ఖచ్చితంగా మీ ముఖ చర్మాన్ని కొద్ది రోజుల్లోనే తెల్లగా ఇంకా కాంతివంతంగా మార్చుకోవచ్చు.ఇంకా అలాగే చాలా రకాల బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ ని తీసుకుని అందులో పది నుంచి పదిహేను బాదం పప్పులు వేసి వాటర్ పోసి రాత్రి అంతా కూడా నానబెట్టుకోవాలి. తరువాత మరుసటి రోజు బాదం పప్పుకు ఉన్న పొట్టును తీసి మిక్సీ జార్ లో వేసి కొద్దిగా రోజ్ వాటర్ ని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.


ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి బాదం పాలను సపరేట్ చేసుకోని ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,  చిటికెడు కుంకుమపువ్వు ఇంకా నాలుగు టేబుల్ స్పూన్లు బాదం పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ఇంకా రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ఈ క్రీమ్ రెడీ అయినట్లే. ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోని రోజు రాత్రి నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే స్కిన్ టోన్ చాలా అద్భుతంగా మెరుస్తుంది. చర్మం తెల్లగా ఇంకా కాంతివంతంగా బాగా మెరుస్తుంది. ఇంకా అలాగే వృద్ధాప్య లక్షణాలు కూడా త్వరగా మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి. చర్మం మృదువుగా అందంగా మారుతుంది.కాబట్టి  ముఖాన్ని తెల్లగా ఇంకా కాంతివంతంగా మార్చుకోవాలని భావిస్తున్న వారు తప్పకుండా పైన తెలిపిన హోమ్ మేడ్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: