మనలో చాలా మంది కూడా చాలా రకాల చర్మ సమస్యలతో ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంకా ఎంత ఖర్చు చేసినా సరైన ఫలితం లేక నిరుత్సాహ పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలను పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని చాలా ఈజీగా మెరుగుపరుచుకోవచ్చు. మన చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం ఖచ్చితంగా రోజుకు 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి.అసలు కాలంతో సంబంధం లేకుండా రోజు తప్పకుండా నీటిని తాగాలి.చాలా మంది కూడా నీరు తాగితే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందని నీరు తాగే విషయంలో చాలా అశ్రద్ద చేస్తూ ఉంటారు. నీటిని తాగడం వల్ల చర్మం ఖచ్చితంగా కాంతివంతంగా తయారవుతుంది.ఇంకా చర్మం పొడి బారకుండా ఉంటుంది.నీటిని తాగడం వల్ల వాతావరణ కాలుష్యం, వేడి ఇంకా సూర్యుడి కిరణాల నుండి చర్మం సంరక్షించబడుతుంది. చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అందుకే అందంగా కనబడాలనుకునే వారు తప్పకుండా నీటిని ఎక్కువగా తాగాలి. ఇంకా అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ ఎ, విటమిన్ సి లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.


ఈ పోషకాలు అందేలా మనం 2 రకాల జ్యూస్ లను తయారు చేసుకుని ఉదయం ఇంకా సాయంత్రం తాగడం వల్ల చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కావల్సిన పోషకాలన్నీ కూడా ఈజీగా అందుతాయి.ఇందుకోసం 2 క్యారెట్స్ , 2 టమాటాలు, ఒక కీరదోస ఇంకా చిన్న బీట్ రూట్ ను ముక్కలుగా చేసి జార్ లో వేసి జ్యూస్ లా చేసుకోవాలి. ఆ తరువాత దీనిని వడకట్టగా వచ్చిన జ్యూస్ లో నిమ్మరసం ఇంకా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రోజు ఉదయం పూట తాగాలి. ఈ జ్యూస్ ను తాగిన అరగంట తరువాత ఏ ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా అలాగే సాయంత్రం 5 గంటల సమయంలో బత్తాయి, ఫైనాఫిల్, కమలా పండ్లతో చేసిన జ్యూస్ లను మీరు తీసుకోవాలి. వీటిలో ఏదో ఒక జ్యూస్ ను ఒక 200 ఎమ్ ఎల్ మెతాదులో తీసుకోవాలి. ఇలా జ్యూస్ లను తీసుకోవడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. ఇంకా చర్మం  రంగు కూడా మెరుగుపడుతుంది. అలాగే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా అదే విధంగా ముఖం అందంగా కనబడాలనుకునే వారు రాత్రి భోజనంలో కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ పండ్లను కూడా సాయంత్రం 7 గంటల లోపే తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: