మన దేశంలో కరోనా వ్యాక్సిన్ పరిక్షలు చాలా వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే నిమ్స్ హాస్పిటల్ లో మరొక నాలుగు రోజుల్లో మూడో దశ భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావడంతో మూడో దశ పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు.  రేపు నిమ్స్ ఎథిక్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది.

దాదాపుగా 100 నుండి 200 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డిసెంబర్ చివరి నాటికి మూడో దశ పూర్తి అవుతుంది అని అధికారులు అంటున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది అనుమతులు పొంది  వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే  అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక వ్యాక్సిన్ తయారిలో ఇండియా కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రిటన్ కూడా దూకుడుగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: