చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నుండి తాత్కాలిక డేటా ఆధారంగా, కరోనాను నివారించడంలో దాని ప్రయోగాత్మక టీకా 94.5% ప్రభావవంతంగా ఉందని మోడరనా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తమ వ్యాక్సిన్ మోతాదుకు 25 డాలర్ల నుంచి  37 డాలర్ల వరకు వసూల్ చేస్తామని చెప్పింది. ఈ విషయాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీఫేన్ బాన్సెల్ జర్మన్ వారపత్రిక వెల్ట్ యామ్ సోన్‌ టాగ్ (వామ్స్) కి చెప్పారు.

మా టీకాకు ఫ్లూ షాట్ మాదిరిగానే ఖర్చవుతుందని ఆయన అన్నారు. ఇది  10 డాలర్ల నుంచి  50 డాలర్ల వరకు ఉండవచ్చు అన్నారు. ఇక ఈ వ్యాక్సిన్ ఎప్పుడు బయటకు వస్తుంది ఏంటీ అనే దానిపై స్పష్టత లేకపోయినా సరే దీని అత్యవసర వినియోగం కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ఒక స్పష్టత  వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: